కడ్తాల్ : పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని సాలార్‌పూర్ గ్రామానికి చెందిన చక్రికి రూ. 13,500, తలకొండపల్లి మండలం జూలపల్లి గ్రామానికి చెందిన ప్రకాశ్‌కి రూ. లక్ష, వెల్దండ మండలం చొక్కన్నపల్లి గ్రామానికి చెందిన సాయికుమార్‌రెడ్డికి రూ. 60వేలు, సంజాపూర్ గ్రామానికి చెందిన వెంకటమ్మకి రూ. 23వేలు, తాండ్ర గ్రామానికి చెందిన చంద్రయ్యకి రూ. 60 వేలు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సహకరంతో సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరయ్యాయి. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు ఎమ్మెల్సీ సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పథకంతో పేదలకందరికీ వరంలా మారిందని, ఈ పథకంతో నిరుపేదలకు కార్పొరేట్ దవాఖానలో అత్యుత్తమ వైద్యం అందుతున్నదని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు సురేందర్‌రెడ్డి, మోత్యానాయక్, బిక్కునాయక్ పాల్గొన్నారు.