వికారాబాద్, ఆగస్టు 11 : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించే ప్రతిపాదన తమ పరిశీలనలో లేదంటూ కేంద్ర జల్‌శక్తి స్పష్టం చేయడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. తెలంగాణకు అత్యంత కీలకమైన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకొచ్చేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంతో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు. రేవంత్‌రెడ్డి 75 సార్లు ఢిల్లీకి వెళ్లానని చెప్పుకోవడం కాదు.. తెలంగాణ హక్కుల కోసం ఎన్నిసార్లు కేంద్రంతో మాట్లాడారని ప్రశ్నించారు. కేంద్రం ఫైల్‌ను తిప్పి పంపే పరిస్థితి రావడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ, పరిపాలనా వైఫల్యం ఉందని ఎద్దేవా చేశారు.