వికారాబాద్, ఫిబ్రవరి 18 : రానున్న వేసవి లో తాగునీటి సమస్యను అధిగమించాలని రా ష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సూచించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్ట ర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులతో స మీక్షా సమావేశం నిర్వహించారు. సమీవేశం లో సాగు, తాగునీరు, నిర్మాణ రంగానికి వి ద్యుత్ అంతరాయం కలగకుండా సరఫరా, రై తు భరోసా, రబీ సీజన్‌కు సాగునీటి సరఫరా, యూరియా కొరత, రేషన్ కార్డుల జారీ, రెసిడెన్షియల్ పాఠశాలల సందర్శన తదితర అం శాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రానున్న వేసవిలో నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా కార్యచరణ రూపొందించాలన్నారు. నిరంతరం నీటిని అందించేలా ప్రణాళిక ప్రకారం అమలు చేయాలన్నారు. రబీ సీజన్ కోసం సాగునీటి సమస్య లేకుండా ప్రాజెక్టులు, చెరువులపై సమీక్షించి ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. వ్యవసాయ సా గులో రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చ ర్యలు తీసుకుంటున్నదని, ఈ నేపథ్యంలో యూరియా కొరత లేకుండా చూడాలని సూచించారు.
విద్యుత్ అంతరాయం లేకుండా..
వేసవిలో వ్యవసాయానికి, తాగునీటికి, నిర్మా ణ రంగానికి విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని శాంతి కుమారి అన్నారు. అర్హత ఉన్న ప్రతి రై తుకు రైతు భరోసా అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజాపాలనలో రేషన్ కా ర్డుల కోసం వచ్చిన దరఖాస్తుల్లో అర్హులైన వా రికి కార్డులు జారీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గురుకుల పాఠశాలలను జిల్లా అధికారులు సందర్శించి పాఠశాలలో నెలకొన్న సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.
అధికారులతో సమీక్షించి..
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ సుధీర్ మా ట్లాడుతూ.. జిల్లాలో వ్యవసాయ రంగానికి, తాగునీటికి, నిర్మాణ రంగానికి విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో విద్యుత్ వినియోగంపై అధికారులతో సమీక్షిస్తూ అవసరమైన చర్యలు చే పడుతున్నామని తెలిపారు. రైతు భరోసా పథ కం కింద అర్హులందరికీ పథకం అందించేలా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. రేషన్ కార్డుల కోసం ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారుల సమన్వయంతో క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే అర్హులందరికీ అందించేలా చ ర్యలు తీసుకుంటామని తెలిపారు.
వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా జిల్లాలోని మారుమూల ప్రాంతాల వరకు నీటిని అందించేందుకు అధికారుల సమన్వయంతో కార్యచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, ట్రైనీ కలెక్టర్ ఉమాహారతి, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్, వ్యవసాయ శాఖ జిల్లా అధికా రి మోహన్‌రెడ్డి, సివిల్ సప్లయ్ అధికారి మో హన్‌బాబు, విద్యుత్ శాఖ ఎస్ఈ లీలావతి, మిసన్ భగీరథ అధికారి చల్మారెడ్డి, సంబంధిత జిల్లా అధికారులు హాజరయ్యారు.