వికారాబాద్/నవాబుపేట, అక్టోబర్ 6 : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దొంగల్లా చూ స్తున్నదని..ఎలాంటి తప్పులు చేయకున్నా ఠాణాకు తరలించడం ఏమిటని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నవాబుపేట మండలానికి చెందిన పలువురు ట్రిపులార్ బాధిత రైతులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి స్థానిక ఠాణాకు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ నవాబుపేట ఠాణా కెళ్లి రైతులతో మాట్లాడి భరోసా ఇచ్చారు.
అలాగే, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభ్రపద్ పటేల్.. హైదరాబాద్‌లోని సబితాఇంద్రారెడ్డి ఇంటికెళ్లి ఆమెతో ట్రిపులార్ బాధిత రైతులతో ఫోన్లో మాట్లాడించారు. ట్రిపులార్ రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని.. రైతులు అధైర్యపడొద్దని ధైర్యం చెప్పారు. ఎప్పుడు పిలిచినా రైతుల పక్షాన ఉంటా మని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ మాట్లాడుతూ.. ట్రిపులార్ అలైన్‌మెంట్‌ను మార్చడంతో నవాబుపేట మండలానికి చెందిన రైతులే కాకుండా వికారాబాద్, మోమిన్‌పేట, పూడూరు మం డలాలకు చెందిన రైతులు కూడా నష్టపోతున్నారన్నారు.
అన్నం పెట్టే రైతులను నక్సలైట్లు, టెర్రరిస్టులు, దోపిడీ దొంగల వలే ఇండ్లలోకి వెళ్లి అరెస్టు చేయడం ఏమిటని మండిపడ్డారు. ట్రిపులార్‌తో తమ పంట పొలాలు పోతున్నాయనే ఆవేదన, బాధతో రైతులు హెచ్ఎండీఏ అధికారులకు తమ సమస్యను చెప్పుకొనేందుకు హైదరా బాద్ కు తరలివెళ్లకుండా పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య, స్పీకర్ గడ్డం ప్రసాద్, సీఎం సొంత ఇలాకాలో రైతు లు ఇబ్బంది పడుతున్నా వారికి కనిపించడం లేదా అని అన్నారు.
12 ఎకరాల భూమి పోతుంది..
మా కుటుంబం వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నది. 12 ఎకరాల భూమి తాతల కాలం నుంచి వస్తున్నది. ఆ ఉన్న భూమి మొత్తం ట్రిపు లార్ కొత్త అలైన్మెంట్లో పోతున్నది. దీంతో తమ కుటుంబం ఎలా బతకాలి. తమ సమస్యను హైదరాబాద్‌లో ఉన్న హెచ్ఎండీఏ అధికారుల కు చెప్పుకొందామని వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. భూములను ఇచ్చి ఠాణాల చుట్టూ తిరగాలా.. మా భూములను బలవంతంగా తీసుకోవాలని చూస్తే సహించలేది లేదు.
-షాన్ పాషా, రైతు,చిట్టిగిద్ద , నవాబుపేట
హెచ్ఎండీఏ ముట్టడికి వెళ్లకుండా కట్టడి
కొందుర్గు : హెచ్ఎండీఏ ముట్టడిలో భాగంగా మండలంలోని తంగెళ్లపల్లి, పాత ఆగిర్యాల గ్రామాల్లోని ట్రిపులార్ భూబాధితులను పోలీసులు సోమవారం ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ బాల్‌రాజు మాట్లాడుతూ.. చిన్న, సన్నకారు రైతుల పొట్టకొట్టేలా ప్ర భుత్వ వ్యవహరించడం సరికాదన్నారు. గతంలో ప్రతిపాదించిన అలైన్‌మెంట్‌ను అమలు చేయాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రవీణ్, రవీందర్‌రెడ్డి, జంగయ్య పాల్గొన్నారు.
కేశంపేట పోలీసుల అదుపులో..
కేశంపేట : హెచ్ఎండీఏ ముట్టడికి వెళ్తారన్నా అనుమానంతో పలువురు రైతులను కేశంపేట పోలీసులు సోమవారం ముందస్తుగా అరెస్టు చేశారు. మండలంలోని తొమ్మిదిరేకుల, నిర్దవెల్లి గ్రామాలకు చెందిన రైతులను తెల్లవారుజామున అదుపులోకి తీసుకుని స్థానిక ఠాణాకు తరలించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ రంగయ్య మాట్లాడుతూ.. రైతులు శాంతియుతంగా నిరసన తెలిపేందుకు యత్నిస్తే ప్రభుత్వం పోలీసులతో అరెస్టులు చేయించడం సరికాదన్నారు. అక్రమ అరెస్టులను సహించేది లేదని ట్రిపులార్ అలైన్‌మెంట్‌ను మార్చేవరకు ఉద్యమిస్తామన్నారు. కార్యక్రమంలో రైతులు మల్లయ్య, ఆంజనేయులు పాల్గొన్నారు.
రైతు ఉద్యమాన్ని ఆపలేరు
కడ్తాల్ : అక్రమ అరెస్టులతో రైతు ఉద్యమాన్ని ఆపలేరని సీపీఎం మండల కార్యదర్శి కురుమయ్య అన్నారు. సోమవారం ఉదయం తలకొండపల్లి, ఆమనగల్లు మండలాలకు చెందిన సీపీఎం నాయకులు ట్రిపులార్ బాధిత రైతులతో కలిసి హెచ్ఎండీఏ ముట్టడికి వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేసి స్థానిక ఠాణాకు తరలించారు. ఈ సందర్భంగా కురుమయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో పాలన సాగిస్తున్నదని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రూ పొందించిన ట్రిపుల్ఆర్ అలైన్మెంట్తో చిన్న, సన్నకారు రైతులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే కొత్త అలైన్ మెంట్ నిర్ణయాన్ని వెనక్కితీసుకోని… 2013 భూ సేకరణ చట్టానికి లోబడి గ్రామసభలు నిర్వహించి, మార్కె ట్ ధరకు అనుగుణంగా మూడింతలు పెంచి భూములు తీసుకోవాలన్నారు. రైతుల నుంచి బలవంతంగా భూములను తీసుకోవాలని యత్నిస్తే.. రైతు, ప్రజా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామన్నారు. అరెస్ట్ అయిన వారిలో సీపీఏం ఆమనగల్లు మండల కార్యదర్శి శివశంకర్, మాజీ ఎంపీటీసీ లక్ష్మయ్య, నర్సింహానాయక్ ఉన్నారు.