ముఖ్యమంత్రి అల్పాహరం మరిన్ని బడుల్లో..
జిల్లాలో లాంఛనంగా ప్రారంభమైన సీఎం కేసీఆర్ అల్పాహార పథకం విజయవంతంగా సాగుతున్నది. అక్టోబ ర్ 6న మహేశ్వరం నియోజకవర్గంలోని రావిర్యాల జడ్పీహెచ్ఎస్లో మంత్రులు హరీశ్‌రావు,
- అక్టోబర్ 6న ‘రావిర్యాల’ పాఠశాలలో లాంఛనంగా ప్రారంభించిన మంత్రులు హరీశ్‌రావు, సబితాఇంద్రారెడ్డి
- అదే రోజు నియోజకవర్గానికి ఒకటి చొప్పున ప్రారంభం
- రెండు రోజుల క్రితం మరో 39 ప్రభుత్వ బడుల్లో అల్పాహార పథకం ప్రారంభం
- ఆనందంలో సర్కారు స్కూళ్ల విద్యార్థులు, తల్లిదండ్రులు
రంగారెడ్డి, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): జిల్లాలో లాంఛనంగా ప్రారంభమైన సీఎం కేసీఆర్ అల్పాహార పథకం విజయవంతంగా సాగుతున్నది. అక్టోబ ర్ 6న మహేశ్వరం నియోజకవర్గంలోని రావిర్యాల జడ్పీహెచ్ఎస్లో మంత్రులు హరీశ్‌రావు, సబితాఇంద్రారెడ్డి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అదే రోజు జిల్లాలోని మిగతా ఏడు నియోజకవర్గాల్లోని ఒక్కొక్క పాఠశాలలో అల్పాహారాన్ని ప్రారంభించారు. దశలవారీగా ఈ పథకాన్ని విస్తరిస్తున్న ప్రభుత్వం ప్రస్తుతం జిల్లాలోని 47 పాఠశాలల్లో సక్సెస్ ఫుల్‌గా అమలు చేస్తున్నది. ఉద యం అల్పాహారం, మధ్యాహ్నం భోజనాన్ని అందిస్తుండడంతో ఆయా బడుల్లోని విద్యార్థులు వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 1,43,500 మందికి చేకూరనున్న లబ్ధి..
సీఎం కేసీఆర్ అల్పాహార పథకం రంగారెడ్డి జిల్లాలోని 1,309 బడుల్లో అమలులోకి వస్తే 1,43,500 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నది. జిల్లాలో 881 ప్రాథమిక పాఠశాలల్లో 63వేల మంది, 181 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 15,500 మంది, 248 హైస్కూల్స్‌లో 65వేల మంది విద్యార్థులు చదువుతు న్నారు. అక్టోబర్ 6 నుంచి జిల్లాలోని మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, షాద్ నగర్, కల్వకుర్తి, రాజేంద్రనగర్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లోని ఒక్కో పాఠశాలలో ఈ అల్పాహార పథకం అమలవుతున్నది.
దసరా తర్వాత పాఠశాలలు పునః ప్రారంభం కాగా ఈనెల 26 నుంచి మరో 39 పాఠశాలల్లో ఈ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో 31 పాఠశాలల్లో, మహేశ్వరం నియోజకవర్గంలో 8 పాఠశాలల్లో కొత్తగా ఈ పథకం అమలవుతున్నది. ప్రస్తుతం జిల్లాలోని 31 ప్రాథమిక పాఠశాలలు, 11 జడ్పీహెచ్ఎస్లు, రెండు ఎంపీపీఎస్‌లు, ఒక్కొక్కటి చొప్పున ఎంపీయూపీఎస్, యూపీఎస్, జీయూపీఎస్లలో ఈ పథకం దిగ్విజయంగా సాగుతున్నది.
ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం
విద్యార్థులు ఖాళీ కడుపుతో పాఠశాలలకు వచ్చి పాఠాలు వినొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం గతంలోనే రాగిజావ, కోడిగుడ్డు, అరటి పండుతోపాటు సన్నబియ్యం తో కూడిన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నది. సీఎం కేసీఆర్ అల్పాహారంతో మరింత పౌష్టికాహారాన్ని అందించొచ్చనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఇది విద్యార్థుల శారీరక, మానసిక ఎదుగుదలకు దోహదపడనుండడంతోపాటు బడిపిల్లల హాజరు శాతం పెరిగి డ్రాపౌట్స్ గణనీయంగా తగ్గనున్నది. మానవీయ కోణంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ఈ పథకంపై విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

