TGSRTC | షాద్నగర్టౌన్, ఫిబ్రవరి 01: మహాశివరాత్రిని పురస్కరించుకుని షాద్నగర్ ఆర్టీసీ బస్టాండ్ నుంచి రామేశ్వరానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు డీఎం ఉష ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25, 26, 27న బస్సులు నడుస్తాయన్నారు. ఆర్టీసీ ద్వారా సురక్షిత ప్రయాణం ఉంటుందన్నారు. భక్తుల సౌకర్యార్ధం ఏర్పాటు చేస్తున్న ఆర్టీసీ బస్సులను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.