యాచారం, జూలై 2 : మండలంలోని మేడిపల్లిలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. గతంలో ఫార్మాసిటీకోసం సేకరించిన భూమి లో రైతు వేసిన పంటను ధ్వంసం చేసేందుకు టీజీఐఐసీ అధికారులు గురువారం పోలీసు బందోబస్తుతో జేసీబీలతో వచ్చారు. గ్రామానికి చెందిన వన్నవాడ శివరాములు అనే రైతు సర్వేనంబర్ 278లో తనకున్న ఐదెకరాల్లో పత్తిని సాగు చేశాడు. కూలీల కోర్టు స్టే ఉండటంతోపాటు తనకు రావాల్సిన ప్లాట్ల డాక్యుమెంట్లు ఇవ్వకపోవడంతో అధికారు లు హెచ్చరిస్తున్నా పంటను సాగు చేయడం తో జేసీబీతో నాశనం చేయిస్తుండగా రైతు కుటుంబీకులు జేసీబీకి అడ్డు తగిలారు.
తమ పంటను నాశనం చేయొద్దని వన్నవాడ మంజుల, వన్నవాడ సంతోష, వన్నవాడ వరలక్ష్మి, వన్నవాడ మానస జేసీబీ ముందుకెళ్లకుండా అడ్డంగా పడుకున్నారు. అంతటి తో ఆగక జేసీబీ బొక్కెనలో పడుకొని మా ప్రాణాలు పోయినా ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకూర్చున్నారు. హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ సీఐ సత్యనారాయణతోపాటు పోలీసులు అక్కడికొచ్చి వారిని బలవంతంగా ఈడ్చి పడేశారు. ఈ క్రమంలో పోలీసులకు రైతులకు మధ్య కొద్దిసేపు తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొన్నది.

పంట ధ్వంసం చేయకుండా జేసీబీకి అడ్డుతగిలిన వన్నవాడ శ్రీకాంత్, వన్నవాడ గణేశ్, మహి ళా రైతులను బలవంతంగా లాక్కెళ్లి పోలీస్ వ్యాను ఎక్కించి మేడిపల్లిలోని హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ ఠాణాకు తరలించి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉంచారు. బుధవారం వన్నవాడ లిం గమయ్య పత్తి పంటను పోలీసులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఆ ఘటన మరువక ముందే మళ్లీ అదే ఘటన పునరావృతం కావడంతో అధికారులు, పోలీసుల తీరుపై రై తులు మండిపడుతున్నారు.
ప్రాణం పోయి న తమ భూములు ఇచ్చేదిలేదని రైతు శ్రీకాం త్ స్పష్టం చేశాడు. రైతులకు పూర్తి స్థాయి పరిహారం అలాగే, ఎకరాకు 121 గజాల చొ ప్పున ఫార్మా ప్లాట్లకు డాక్యుమెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కోర్టు స్టే ఆర్డర్ ఉన్న భూముల్లోకి అక్రమంగా రావడమే కాకుం డా రైతు సాగుచేసిన పంటను జేసీబీతో ధ్వం సం చేయడం ఎంతవరకు సమంజసమని ఫార్మా వ్యతిరేక పోరాటకమిటీ సమన్వయకర్త సరస్వతి అక్కడి అధికారులతో మండిపడ్డారు. రైతులకు ఫార్మా ప్లాట్ల రిజిస్ట్రేషన్ పత్రాలను వెంటనే ఇవ్వాలని అప్పటివరకు ఫార్మా భూముల్లోకి రావొద్దని ఆమె సూచించారు.