Vishnu Shivalayam | శామీర్‌పేట, ఫిబ్రవరి 15: ఉద్దెమర్రి విష్ణు శివాలయ అభివృద్ధి పనులకు టెండర్లు పిలుస్తున్నట్లు దేవాలయ చైర్పర్సన్ ఆడెపు ఉమా మహేశ్వరి, ధర్మకర్తలు బూడిద రవీందర్‌గౌడ్, సామల రాజిరెడ్డి, బురిగళ్ల రమేశ్ తెలిపారు. ఆలయ అభివృద్ధి కోసం రూ.50 లక్షల మంజూరైన విషయం తెలిపారు. దేవాలయ అభివృద్ధి పనులు చేపట్టేందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ టెండర్ ప్రకటన జారీ చేసిందన్నారు. ఈ నెల 28లోపు టెండర్ ప్రక్రియ పూర్తి అనంతర విష్ణు శివాలయంలో రాజగోపురం, నీరాలి మండపం, స్వామి వారి పుష్కరిణి, పుష్కర ఘాట్ వంటి అభివృద్ధి పనులు ప్రారంభమవుతాయన్నారు.