కడ్తాల్, జనవరి 17 : రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని రావిచేడ్ గ్రామంలో మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.70.92 లక్షలతో చేపట్టిన అదనపు గదులు, ప్రహరీ నిర్మాణం, వంట గది, రూ.20 లక్షలతో చేపట్టిన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులను ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, జడ్పీటీసీ దశరథ్‌నాయక్, ఎంపీటీసీ గోపాల్, సర్పంచ్ భారతమ్మతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో ఉన్నదని తెలిపారు. రావిచేడ్ గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి మండల పరిషత్ నిధులు రూ.5 లక్షలు కేటాయిస్తున్నట్లు ఎంపీపీ కమ్లీమోత్యానాయక్ తెలిపారు.
నియోజకవర్గానికి రూ.13.89 కోట్లు మంజూరు
నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.13.89 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ తెలిపారు. కల్వకుర్తి మండలానికి 1.75 కోట్లు, వెల్దండకు రూ.2.80 కోట్లు, చారకొండకు రూ.45 లక్షలు, ఆమనగల్లుకు రూ.కోటి, మాడ్గుల్‌కు రూ.2.37 కోట్లు, తలకొండపల్లికి రూ.2.92 కోట్లు, కడ్తాల్ మండలంలోని అన్మాస్‌పల్లి గ్రామానికి రూ.1.15 కోట్లు, ముద్విన్కు రూ.10 లక్షలు, కర్కల్పహాడ్కు రూ.5 లక్షలు, సాలార్పూర్కు రూ.5 లక్షలు, న్యామతాపూర్‌కు రూ.5 లక్షలు, చరికొండకు రూ.5 లక్షలు, గాన్గుమార్లతండాకు రూ.10 లక్షలు, బాలాజీనగర్తండాకు రూ.5 లక్షలు, వాసుదేవ్పూర్ తండాకు రూ.5 లక్షలు, గోవిందాయిపల్లి తండాకు రూ.5 లక్షలు, రావిచేడ్ గ్రామానికి రూ.15 లక్షలు, నార్లకుంటతండాకు రూ.5 లక్షలు, గోవిందాయిపల్లి గ్రామానికి రూ.5 లక్షలు, మక్తమాదారానికి రూ.10 లక్షలు, మైసిగండికి రూ.5 లక్షలు, పెద్దవేములోనిబావి తండాకు రూ.5 లక్షలు, మర్రిపల్లికి రూ.5 లక్షలు, గడ్డమీదితండాకు రూ.5 లక్షలు, చల్లంపల్లికి రూ.10 లక్షలు, ఏక్వాయిపల్లికి రూ.10 లక్షలు, రేఖ్యాతండాకు రూ.10 లక్షలు, కొండ్రిగానిబోడు తండాకు రూ.10 లక్షలు, కడ్తాల్‌కు రూ.10 లక్షలు, పల్లెచెల్కతండాకు రూ.5 లక్షలు మంజూరయ్యాయని వివరించారు.
45 గ్రామాలకు కొత్త జీపీ భవనాలు
నియోజకవర్గంలోని 45 గ్రామాలకు కొత్త జీపీ భవనాల నిర్మాణాలకు రూ.9 కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ తెలిపారు. కడ్తాల్ మండలానికి 9, కల్వకుర్తికి 7, వెల్దండకు 7, చారకొండకు 2, ఆమనగల్లుకు 2, తలకొండపల్లికి 8, మాడ్గుల మండలంలో 9 గ్రామాల్లో జీపీ భవన నిర్మాణాలకు రూ.20 లక్షల చొప్పున నిధులు విడుదలయ్యాని, మరో 38 జీపీ భవనాల నిర్మాణానికి త్వరలో నిధులు మంజూరవుతాయని ఆయన పేర్కొన్నారు. మున్సిపాలిటీ గ్రామ పంచాయతీల్లో బస్తీ, పల్లె దవాఖానల్లో ఏర్పాటులో భాగంగా మాడ్గుల మండలంలో 7, వెల్దండ మండలంలో 5, తలకొండపల్లి మండలంలో 6, చారకొండలో 3, కల్వకుర్తి మున్సిపాలిటీలో మూడు బస్తీ, ఐదు పల్లె దవాఖానలు, ఆమనగల్లు మున్సిపాల్టీలో రెండు బస్తీ, రెండు పల్లె దవాఖానలు, కడ్తాల్ మండలంలోని రావిచేడ్, చల్లంపల్లి, చరికొండ, ముద్విన్ గ్రామాల్లో పల్లె దవాఖానలు మంజూరు కావడం జరిగిందని ఎమ్మెల్యే వివరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ బొప్పిడి గోపాల్, సర్పంచ్‌లు భారతమ్మ, హరిచంద్‌నాయక్, యాదయ్య, సులోచన, ఉప సర్పంచ్ వెంకటేశ్, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, మండల, గ్రామాలాధ్యక్షులు వీరయ్య, బాలకృష్ణ, పీఏసీఎస్ డైరెక్టర్ శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల, గ్రామలాధ్యక్షులు పరమేశ్, రమేశ్‌యాదవ్, వార్డు సభ్యులు పవన్, మల్లేశ్‌యాదవ్, రవి, రమాదేవి, శ్రీలత, నాయకులు లింగం, యాదయ్య, జమీర్, సాయిలు, చంద్రమౌళి, వసంత, శ్రీశైలం, నార్యా, పాండు, ఎస్ఎంసీ చైర్మన్లు రవి, అమీర్, ఎంపీడీవో రామకృష్ణ, ఎంపీవో మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు.