హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ) ;మహిళలు గళమెత్తారు. తమకు జరుగుతున్న అన్యాయంపై కన్నెర్ర చేశారు. మూడు దశాబ్దాలుగా మహిళా బిల్లును తొక్కిపెట్టిన కేంద్రం తీరుకు నిరసనగా జంతర్‌మంతర్ వేదికగా చేపట్టిన ఒక రోజు నిరసన దీక్షలో తమ సత్తా చాటారు. భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన ఈ దీక్షకు అపూర్వ మద్దతు లభించింది. దేశం నలుమూలల నుంచి వచ్చిన వివిధ పార్టీల నేతలు, మహిళా సంఘాల నాయకులు సంఘీభావం ప్రకటించారు. రెండుసార్లు మ్యానిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చినా మహిళా బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టకుండా కాలయాపన చేస్తున్న మోదీపై మహిళాలోకం ఆగ్రహం వ్యక్తం చేసింది. చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆమోదించాలని ముక్తకంఠంతో నినదించింది.
08
09