ఇబ్రహీంపట్నం, జూలై 29 : అబ్దుల్లాపూర్మెట్ మండలం బండరావిరాల సమీపంలోని సర్వే నంబర్ 268లో ఏర్పాటు చేసిన మైనింగ్జోన్లో భూములు కోల్పోయిన 209మంది రైతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. గతంలో అబ్దుల్లాపూర్మెట్లో పర్యటించిన రాష్ట్ర ఐటీశాఖమంత్రి కల్వకుంట్ల తారకరామారావు దృష్టికి ఈ విషయాన్ని తీసుకుపోగా. ప్రతి రైతుకూ పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. కాగా, శనివారం పరిహారానికి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో కాపీని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సదరు రైతులకు అందజేశారు. త్వరలోనే బాధితులకు పరిహారం అందనున్నది.