తాండాలకూ తారు రోడ్లు..
గిరిజన తండాలకు మహర్దశ వచ్చింది. తండాలకు వెళ్లే దారులను బీటీ రోడ్లుగా మార్చేందుకు గిరిజ న సంక్షేమ శాఖ నిధులను విడుదల చేసింది. రం గారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, షాద్‌నగర్, మహేశ్వరం నియోజకవరాల్లోని తండాలకు రూ.26కోట్లను మంజూరు చేసింది. త్వరలోనే టెండర్ల ప్రక్రియ ను పూర్తిచేసి పనుల ప్రారంభానికి అవసరమైన చర్యలను సంబంధిత అధికారులు చేపట్టనున్నా రు.
- మహేశ్వరం, చేవెళ్ల, షాద్‌నగర్ నియోజకవర్గాలకు నిధులు మంజూరు
- రూ.26కోట్లు విడుదల చేసిన గిరిజన సంక్షేమ శాఖ
- 32.31కి.మీ దారులను బీటీగా మార్చేందుకు చర్యలు
- సంతోషం వ్యక్తం చేస్తున్న గిరిజనం
గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. సీఎం కేసీఆర్ తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి ‘మా తండాల్లో మా రాజ్యం’ అనే గిరిజనుల చిరకాల ఆకాంక్షను నెరవేర్చారు. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 60 తండాలను జీపీలుగా మార్చగా, ప్రగతి పథంలో ముందుకెళ్తున్నాయి. ఇతర గ్రామాలకు దీటుగా మౌలిక వసతులు కల్పిస్తుండడంతో గిరిజనుల సమస్యలు పరిష్కారమవుతున్నాయి. ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి తండాల్లో సకల వసతులు కల్పిస్తున్నది. ముఖ్యంగా తండాలకు వెళ్లే దారులను బీటీ రోడ్లుగా మార్చుతూ రవాణా సౌకర్యాన్ని మెరుగుపరుస్తున్నది. ఇప్పటికే పలు తండాల మట్టిరోడ్లను బీటీగా మార్చిన ప్రభుత్వం తాజాగా చేవెళ్ల, షాద్‌నగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లోని తండాలకు 32.31 కి.మీ మేర బీటీ రోడ్ల నిర్మాణానికి పూనుకున్నది. అందుకోసం రూ.26కోట్ల నిధులను సైతం మంజూరు చేసింది. త్వరలోనే టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి పనుల ప్రారంభానికి అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. తండాల రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
రంగారెడ్డి, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ) :‘గిరిజన తండాలకు మహర్దశ వచ్చింది. తండాలకు వెళ్లే దారులను బీటీ రోడ్లుగా మార్చేందుకు గిరిజ న సంక్షేమ శాఖ నిధులను విడుదల చేసింది. రం గారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, షాద్‌నగర్, మహేశ్వరం నియోజకవరాల్లోని తండాలకు రూ.26కోట్లను మంజూరు చేసింది. త్వరలోనే టెండర్ల ప్రక్రియ ను పూర్తిచేసి పనుల ప్రారంభానికి అవసరమైన చర్యలను సంబంధిత అధికారులు చేపట్టనున్నా రు. ఇప్పటికే అనేక తండాలకు బీటీ రోడ్ల సదుపాయాన్ని కల్పించిన ప్రభుత్వం తాజాగ.. 32.31కి.మీ.మేర రోడ్లను బీటీ రహదారులుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటుండడంతో గిరిజన ప్రజానీకం సంతోషం వ్యక్తం చేస్తున్నది.’
తండాల అభివృద్దికి ప్రత్యేక చర్యలు.. : సబితారెడ్డి, విద్యాశాఖ మంత్రి
ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యానికి గురైన తండాలను సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు. తండాల్లో స్వయం పాలనను అమల్లోకి తెచ్చి అనేక మౌలిక సదుపాయాలు కల్పించారు. పంచాయతీలకు పక్కా భవనాలు నిర్మించి ఇచ్చారు. మారుమూలన ఎత్తైన గుట్టల ప్రాంతంలో ఉన్న తండాలకు మిషన్ భగీరథ నీళ్లిచ్చి ఏండ్లనాటి తాగునీటి తండ్లాటను తీర్చారు. జిల్లాలో అనేక తండాలకు బీటీ రోడ్లను నిర్మించారు. రవాణా సౌకర్యాన్ని మరింత మెరుగుపర్చేందుకు గిరిజన సంక్షేమ శాఖ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో తండాలకు బీటీ రోడ్లను సమకూర్చేందుకు రూ.26కోట్లను మంజూరు చేసింది. త్వరలోనే టెండర్లు పూర్తి చేసి పనులను మొదలు పెట్టేందుకు చర్యలు తీసుకుంటాం.
ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యం
ఉమ్మడి రాష్ట్రంలో గిరిజన తండాలకు వెళ్లే రహదారులు పూర్తి నిర్లక్ష్యానికి గురయ్యాయి. కనీసం మట్టి రోడ్లకు సైతం తండా రోడ్లు నోచుకోలేక పోయాయి. నిధుల లేమితో నిర్వహణ సైతం లేక తండాలకు వెళ్లే దారులు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. వర్షాలకు రోడ్లు గతుకులమయమై రాకపోకలకు సైతం వీలులేకుండా తయారయ్యా యి. అత్యవసర వైద్య సేవల సందర్భంలో సమయానికి వైద్యం అందక గిరిజనం ఇబ్బందులు పడుతున్న ఉదంతాలెన్నో తండాల్లో చోటు చేసుకునేవి. గిరిజన సమస్యలను తెలంగాణ ఉ ద్యమ సమయంలో స్వయంగా చూసిన సీఎం కేసీఆర్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నా రు. ఈ క్రమంలోనే తండాలకు వెళ్లే రహదారుల అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందించి బీటీ రోడ్ల ఏర్పాటుకు దండిగా నిధులు మంజూరు చేస్తున్నారు.
32.31కి.మీ.ల మేర బీటీ రోడ్లు
తండాల నుంచి వివిధ ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచేందుకు గిరిజన సంక్షేమ శాఖ రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, చేవెళ్ల, షాద్‌నగర్ నియోజకవర్గాల్లోని తండాలకు బీటీ రోడ్లను మంజూరు చేసింది. మహేశ్వరం నియోజకవర్గంలో 14.31 కిలోమీటర్ల మేర బీటీగా మార్చేందుకు 12 రోడ్లకు రూ.11.65కోట్ల నిధులను మంజూరు చే సింది. షాద్‌నగర్ నియోజకవర్గంలో 10 రోడ్లను 13.80కిలోమీటర్ల మేర బీటీగా మార్చేందుకు రూ.10.25కోట్లను మంజూరు చేసిం ది. చేవెళ్ల ని యోజకవర్గంలో రెండు రోడ్లను 4.10కిలోమీటర్ మేర బీటీగా మార్చేందుకు రూ.3.35కోట్లను మం జూరు చేసింది. త్వరలోనే ఆయా రోడ్ల కు టెండర్లు పిలవనుండడంతో మట్టి తోవలు బీటీ రోడ్లుగా రూపాంతరం చెందనున్నాయి.
మా తండాలో మా రాజ్యం..
గిరిజన తండాల్లో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు ఎస్టీల రాజకీయ సాధికారతకు సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. మా తండాలో మా రాజ్యం అనే గిరిజనుల చిరకాల ఉద్యమ ఆకాంక్షకు కార్యరూపం ఇచ్చి రంగారెడ్డి జిల్లాలోని 60 తండాలను పంచాయతీలుగా మార్చి స్వయం పాలనను తెచ్చారు. గిరిజనులే ప్రజాప్రతినిధులై ప్రభుత్వ సంబంధిత కార్యక్రమాల్లో భాగస్వామ్యులై తండాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నారు. ఇంతటితో ప్రభుత్వం వదిలేయకుండా తండాలకు వెళ్లే రోడ్లను సైతం క్రమక్రమంగా అభివృద్ధి చేస్తూ వస్తున్నది. మట్టి రోడ్లను బీటీగా మార్చి రవాణా సౌకర్యాన్ని మెరుగుపర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఫలితంగానే ఒకప్పుడు ఆర్టీసీ బస్సు అంటేనే ఎరుగని తండాలకు నేడు ఆ సౌకర్యం సమకూరింది. విద్యా, వైద్య, నిత్యావసర వస్తువులు తదితర ఎన్నో సౌలభ్యాలు తండాల్లోని గిరిజనులకు ఒనగూరాయి.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

