రంగారెడ్డి, జూన్ 7 (నమస్తే తెలంగాణ): జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలు, ప్ర మోషన్ల ప్రక్రియ ప్రహసనంగా మారుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా టీచర్ల బదిలీలు, ప్రమోషన్లకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేయగా.. రంగారెడ్డి జిల్లాను మిన హాయించడం ఉపాధ్యాయులను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నది. వాస్తవానికి టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ గతేడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లోనే జరగాల్సి ఉన్నది. అయితే ప్రమోషన్లకు టెట్లో ఉత్తీర్ణత తప్పనిసరి హైకోర్టు తీర్పు ఇవ్వడం తో బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ మొత్తం నిలిచిపోయింది. దీంతోపాటు జీవో 317 పై రంగారెడ్డి జిల్లాకు చెందిన టీచర్లు హైకోర్టును ఆశ్రయించారు. పోస్టులు లేకున్నా కొంతమంది టీచర్లు ఇతర జిల్లాల నుంచి రంగారెడ్డి జిల్లాకు రావడంతో నష్టపోతున్నామంటూ కోర్టుకు విన్నవించుకున్నారు. అప్పటికే బదిలీల కోసం జిల్లాలో 1,878 మంది దరఖాస్తు చేసుకున్నారు. కోర్టు స్టేతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. అలాగే.. ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలుగా 65 మందికి, స్కూల్ అసిస్టెంట్లుగా 112 మం దికి ప్రమోషన్లు సైతం నిలిచిపోయాయి. చాలాకాలంగా బదిలీలు, ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న టీచర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం షెడ్యూల్ ప్రకటించి శుభవార్త చెప్పగా..రంగారెడ్డి జిల్లా టీచర్లకు మాత్రం నిరాశే మిగిలింది. కోర్టు స్టే కారణంగా జిల్లాను మినహాయించడంతో ఇన్నాళ్లుగా ఎంతో ఆశతో షెడ్యూల్ కోసం ఎదురుచూసిన టీచర్లకు మళ్లీ భంగపాటే మిగిలింది. కేవలం గ్రేడ్-2 హెచ్ఎంల పదోన్నతులకు మాత్రమే అవకాశమిచ్చారు. గతంలో కొంతమంది ఉద్దేశపూర్వ కంగా కోర్టుకెళ్లి బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను చేపట్టకుండా అడ్డుకోగా చాలా మంది టీచర్లు నష్టపోయారు. గతేడాదిలో కోర్టు విధించిన స్టేను వేకెట్ చేయిం చడంలో అధికారులు తాత్సారం చేయడంతో ప్రస్తుతం టీచర్ల బదిలీల ప్రక్రియకు నోచుకోలేకుండాపోతున్నమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బదిలీలు నిలిచిపోయి చివరకు పదోన్నతి పొందకుండానే రిటైరైపోతామేమోనని కొందరు టీచర్లు ఆందోళన చెందుతున్నారు.