రంగారెడ్డి, సెప్టెంబర్ 12(నమస్తే తెలంగాణ) : పచ్చని హారంగా మార్చేందుకు సీఎం కేసీఆర్ సంకల్పించిన హరితహారం కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో యజ్ఞంలా సాగుతున్నది. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు సబ్బండ వర్ణాలు హరితహారంలో భాగస్వాములవుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఖాళీ ప్రదేశాలు, ప్రధాన రహదారులకు ఇరువైపులా, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాల ఆవరణల్లో విరివిగా మొక్కలను నాటుతుండగా, ప్రజలు ఇండ్ల ఆవరణల్లో పూలు, పండ్ల మొక్కలను నాటుకుంటున్నారు. ఈసారి జిల్లాలో 78.66 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా, అన్ని శాఖల సమష్టి కృషితో ఇప్పటివరకు 74.70లక్షల మొక్కలను నాటి లక్ష్యానికి చేరువయ్యారు. నాటిన ప్రతి మొక్కకూ ఎప్పటికప్పుడు జియోట్యాగింగ్ ప్రక్రియను చేపడుతున్నారు. వారం, పది రోజుల్లో లక్ష్యాన్ని పూర్తి చేసేలా జిల్లా యంత్రాంగం కృషి చేస్తున్నది. కలెక్టర్ పర్యవేక్షణలో మొక్కల సంరక్షణ బాధ్యతలను కూడా ఆయా శాఖలకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఇప్పటికే సర్కారు సంకల్పం ఫలిస్తున్నది. ఇదివరకు నాటిన మొక్కలు వృక్షాలై ఏ పల్లెకెళ్లినా హరిత స్వాగతం పలుకుతున్నాయి.
రాష్ర్టాన్ని పచ్చగా మా ర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం జిల్లాలో దిగ్విజయం గా సాగుతున్నది. ఈ మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ నిమగ్నమవుతున్నారు. హరిత రాష్ట్రంగా మార్చాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం మేరకు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు మొదలుకుని సామాన్యుల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటుతున్నారు. జిల్లాలో ఈ ఏ డా ది 78.66 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా అన్ని శాఖల ఆధ్వర్యంలో ఇప్పటివరకు 74.70 లక్షల మొక్కలను నాటా రు. ఎప్పటికప్పుడు మొక్కల జియోట్యాగింగ్ ప్రక్రియను కూడా చేపడుతున్నారు. వారం, పది రోజల్లో లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు అధికా రులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఇప్పటివరకు నాటిన మొక్కలు 74.70 లక్షలు
హరితహారంలో భారీ స్థాయిలో మొక్కలను నాటాలన్న ఉద్దేశంతో జిల్లా అధికార యంత్రాంగం నర్సరీల్లో పెద్ద ఎత్తున మొక్కలను పెంచింది. జిల్లాలో 558 గ్రామపంచాయతీలుండగా.. ప్రతి గ్రామ పంచాయతీలోనూ గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కల పెంపకాన్ని చేపట్టింది. అటవీశాఖ సైతం నర్సరీల్లో మొక్కలను సిద్ధంగా ఉంచింది. మొత్తం 12 శాఖల అధికారులు కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. హరితహారం లక్ష్యాన్ని ఇప్పటికే అటవీ, గ్రామీణాభివృద్ధి, విద్యాశాఖలు పూర్తి చేశాయి. అటవీశాఖ లక్ష్యం 8.40 లక్షలు కాగా 22.52 లక్షల మొక్కలు నాటి 268 శాతంతో లక్ష్యాన్ని అధిగమించింది. గ్రామీణాభివృద్ధి శాఖ లక్ష్యం 36.75 లక్షలు కాగా..36.83లక్షల మొక్కలు నాటి వంద శాతం లక్ష్యాన్ని అధిగమించింది. అలాగే విద్యాశాఖ సైతం 78,750 మొక్కలకుగాను 78,930 మొక్కలు నాటి లక్ష్యాన్ని అధిగమించింది. ప్రస్తుతం వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో అనుకున్న లక్ష్యాన్ని త్వరగా పూర్తిచేసే దిశగా అన్ని శాఖలు చర్యలు తీసుకుంటున్నాయి. జిల్లాలో 78.66 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు 74.70 లక్షల మొక్కల నాటే ప్రక్రియ పూర్తయ్యింది. ప్రతి మొక్కనూ జియోట్యాగింగ్ చేయడంతోపాటు మొక్కల సంరక్షణ బాధ్యతలను కూడా ఆయా శాఖలకు ప్రభుత్వం అప్పగించింది. మొక్కలకు నీరు పోయడంతోపాటు సస్యరక్షణ పరంగా తీసుకుంటున్న చర్యలు..ఆకుపచ్చ తెలంగాణకు బాటలు వేస్తున్నాయి. ఇప్పటికే నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదకర వాతా వరణాన్ని అందిస్తున్నాయి.
ప్రజల భాగస్వామ్యంతో..
జిల్లాలో హరితహారం కార్యక్రమం పెద్ద ఎత్తున సాగుతున్నది. వర్షాలు కూడా సమృద్ధిగా కురుస్తుండడంతో ఊరూరా ఉద్యమంలా సాగుతున్నది. కలెక్టర్ పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు జిల్లా స్థాయి అధికారులు రోజుకోచోట కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటుతున్నారు. ఆకుపచ్చ తెలంగాణ కోసం సబ్బండ వర్ణాలు సైతం ఇందులో భాగస్వామ్యులవుతున్నారు. ఇండ్ల ఆవరణల్లో పూలు, పండ్ల మొక్కలను నాటుకుంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఖాళీ ప్రదేశాలు, ప్రధాన రహదారులకు ఇరువైపులా..పల్లె ప్రకృతివనాలు, వైకుంఠధామాల ఆవరణల్లో విరివిగా మొక్కలను నాటేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పొలం గట్ల వెంట తాటి వనాలను నా టే దిశగా సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.