యాచారం, ఆగస్టు2: ఫార్మా భూముల రేడియల్ సర్వే మూడవ రోజు సైతం కొనసాగింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని మేడిపల్లి గ్రామంలో ఆర్డీఓ అనంతరెడ్డి పర్యవేక్షణలో శనివారం సర్వే నంబర్ల ఆధారంగా అధికారులు సర్వేచేసి హద్దులు గుర్తించారు. ఫార్మా భూముల రేడియల్ (డిజిటల్) సర్వేకు ఏసీపీ కేపీవీ రాజు పర్యవేక్షణలో హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటి సీఐ సత్యనారాయణ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆర్ఐ మురళికృష్ణ, టీజీఐఐసీ అధికారులతో కలిసి గతంలో సేకరించిన భూములకు సర్వే చేపట్టారు. ఫార్మా భూములకు సర్వేనంబర్ల ఆధారంగా హద్దులు గుర్తిస్తున్నారు. అదే విధంగా సర్వే చేసిన ఫార్మా భూములను బ్లాకులుగా విభజించి హద్దులు గుర్తిస్తున్నారు. ఆ భూములను పరిశ్రమల ఏర్పాటుకు కేటాయించనున్నారు. మండలంలోని మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాల రైతులు, ప్రజలు సర్వేకు సహకరించాలని కోరుతున్నారు.