తుర్కయంజాల్,ఫిబ్రవరి 23 : అంతర్జాతీయ ప్రమాణాలతో కొహెడ పండ్ల మార్కెట్(Koheda fruit market) నిర్మాణం చేపట్టనున్నట్లు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ సురేంద్ర మోహన్ అన్నారు. ఆదివారం ఆయన గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చిలుక మధుసూధన్‌రెడ్డితో కలిసి కొహెడ పండ్ల మార్కెట్ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కొహెడ పండ్ల మార్కెట్ నిర్మాణం కోరకు సిద్ధమైన డీపీఆర్‌ను పరిశీలించడంతో పాటుగా లేఅవుట్‌ను పరిశీలించారు .
అంతర్జాతీయ ప్రమాణాలతో అసియాలోనే అతిపెద్ద మార్కెట్‌గా నిలిచేలా కొహెడ పండ్ల మార్కెట్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపోందించందని తెలిపారు. అనంతరం గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చిలుక మధుసూధన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంప్రతిష్టాత్మకంగా కొహెడ పండ్ల మార్కెట్‌ను నిర్మించేందుకు దృష్టి సారించందని తెలిపారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కొహెడ పండ్ల మార్కెట్ నిర్మాణ పనులను ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ భాస్కరా చారి, డైరెక్టర్లు, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి శ్రీనివాస్, ఇంజినీర్ లక్ష్మణుడు, తదితరులు పాల్గొన్నారు.