వికారాబాద్, నవంబర్ 6 : అధ్వాన రోడ్లు.. మాకు ఇంకెన్నాళ్లు అంటూ విద్యార్థులు, డాక్టర్లు, స్థానికులు కదంతొక్కారు. రేవంత్ సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం వికారాబాద్ పట్టణంలో బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారికి శ్రద్ధాంజలి కట్టించారు. పట్టణంలోని పలు కళాశాలల విద్యార్థులు, డాక్టర్లు, స్థానికులు భారీగా శ్రద్ధాంజలి ర్యాలీ లో పాల్గొన్నారు. ఈ ర్యాలీ ఆలంపల్లి నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు కొనసాగింది. అనంతరం రోడ్డుపై ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు మళ్లీ జరు గకుండా రోడ్డు భద్రతపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోడ్లను అభివృద్ధి చేయాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, సదానందరెడ్డి, సతీశ్, ఆనంద్, ఆయా కళాశాలల విద్యార్థులు, డాక్టర్లు పాల్గొన్నారు.