Avocado | గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల్లో అవకాడోలు కూడా ఒకటి. ఇవి క్రీమి టెక్స్చర్ తో చాలా రుచిగా ఉంటాయి. టోస్ట్, స్మూతీ, సలాడ్ ఇలా ఏ రూపంలో తీసుకున్న కూడా ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు మొత్తం శరీర ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. అయితే ఇతర పండ్లల్లో కంటే ఇవి ప్రత్యేకమైనవి అని చెప్పవచ్చు. వీటిలో హృదయనాళ సమతుల్యతను ప్రోత్సహించే బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. అవకాడోలో ఉండే మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడతాయి. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలకు మద్దతును ఇస్తాయి. దీనిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, చక్కెర స్థాయిలను నిర్వహించడంలో ఇది ఎంతో సహాయపడుతుంది.
అవకాడోలో ఉండే పొటాషియం రక్తపోటును తగ్గించడంలో, సోడియం ప్రభావాలను సమతుల్యం చేయడంలో దోహదపడుతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి వాపుతో పోరాడడంలో ఉపయోగపడతాయి. అవకాడో గుండె లయకు అవసరమయ్యే ఫోలేట్, మెగ్నీషియంలను కూడా కలిగి ఉంటుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎండోథెలియల్ పనితీరు మెరుగుపడుతుంది. రక్తనాళాలు వ్యాకోచం చెందే సామర్థ్యం పెరుగుతుంది. హృదయనాళ వ్యవస్థపై ఒత్తిడి తగ్గుతుంది. అవకాడోలను తీసుకోవడం వల్ల రక్తనాళాల ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు అడ్డంకులు ఏర్పడడాన్ని తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన లిపిడ్ ప్రొఫైల్ నిర్వహించడానికి సహాయపడుతుంది.
అవకాడోలను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. రక్తప్రవాహం నుండి కొలెస్ట్రాల్ తొలగించబడుతుంది. అవకాడోలను తీసుకోవడం వల్ల గుండె జబ్బులకు కారణమయ్యే ట్రైగ్లిజరాయిడ్ స్థాయిలు కూడా తగ్గుతాయి. కొలెస్ట్రాల్ తో పాటు రక్తపోటును నియంత్రించడంలో కూడా అవకాడో సహాయపడుతుంది. అధిక రక్తపోటు గుండె ఆరోగ్యానికి హానిని కలిగిస్తుంది. అవకాడోలో పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు సమృద్దిగా ఉంటాయి. ఇవి వాస్కులర్ రిలాక్సేషన్, స్థిరమైన ప్రసరణను ప్రోత్సహించడంలో సహాయపడతాయి. అవకాడోలో లభించే ఫైటోస్టెరాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. దీంతో రక్తనాళాల గోడలు దెబ్బతినకుండా ఉంటాయి. ఇలా అనేక రకాలుగా అవకాడోలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయని వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
ఇక ఈ అవకాడోలను టోల్గ్రెయిన్ టోస్ట్ పై విస్తరించి గుడ్డుతో కలిపి తీసుకోవచ్చు. అలాగే సలాడ్ లలో అవకాడోలను ముక్కలుగా చేసి వేసుకుని తినవచ్చు. అలాగే స్మూతీలను తయారు చేసేటప్పుడు అందులో అవకాడోను వేసి స్మూతీ తయారు చేసి తీసుకోవచ్చు. శాండ్విచ్ లను మయోనీస్, బటర్ కు బదులుగా అవకాడోతో తీసుకోవచ్చు. వెజిటేబుల్ స్టిక్స్, హోల్‌గ్రెయిన్ క్రాకర్స్ లేదా గ్రిల్డ్ ఫుడ్స్ వంటి వాటిని అవకాడో డిప్ లతో కలిపి తీసుకోవచ్చు. ఈ విధంగా ఆరోగ్యకరమైన ఆహారాలతో అవకాడోను జత చేసి తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంతో పాటు మొత్తం శరీర ఆరోగ్యానికి మేలు కలుగుతందని వైద్యులు తెలియజేస్తున్నారు.