CULT Teaser | హీరో కమ్ డైరెక్టర్‌గా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న మూవీ ‘కల్ట్’ (CULT). గాయత్రి భరద్వాజ్ హీరోయిన్గా నటిస్తోంది. ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం మేకర్స్ ఈ మూవీ టీజర్‌ను లాంచ్ చేశారు.
ముగ్గురు స్నేహితులు బీర్ తాగుతూ.. పాసులుంటే మనం కూడా పోయేటోళ్లం రా పార్టీకి.. గోవాల ఉండి ఏం చేస్తలేం రా.. అంటే పైసల్లేనప్పుడు ఏం చేస్తం బై.. అంటుండగానే వారిలో ఒకడు పాసులు దొరికినయి మామా అని చెబుతున్న డైలాగ్స్ తో షురూ అయింది టీజర్. ఒక్కసారి అందులోకి ఎంట్రీ ఇస్తే స్వర్గమే.. నో లా, నో లిమిట్.. అంటూ పబ్, పార్టీ, ఎంజాయ్ మూడ్‌లో ఉన్న క్రమంలో సడెన్‌గా విశ్వక్సేన్ ఎంట్రీ ఇవ్వడం, ఆ తర్వాత ఫైట్ సీన్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి.
వియత్నాంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా, నవతరం యువతకు కనెక్ట్ అయ్యే కొత్త తరహా కథను కల్ట్‌లో చూపించబోతున్నట్టు ఇన్సైడ్ టాక్. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, ప్రచార చిత్రాలు సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి.
ఈ చిత్రానికి ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. పాపులర్ యాక్టర్ కమ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తున్నాడు. సందీప్ కాకర్ల, కరాటే రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్, జపనీస్, స్పానిష్ వంటి అంతర్జాతీయ భాషల్లో కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
‘ఫలక్‌నుమా దాస్’, ‘దాస్ కా దమ్కీ’ సినిమాల తర్వాత విశ్వక్ సేన్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
‘కల్ట్’ టీజర్..