కొడంగల్, అక్టోబర్ 27 : రోజువారి చేరికలతో నియోజకవర్గం గులాబీమయంగా మారుతుందని, గ్రామ గ్రామాలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు. శుక్రవారం కొత్తపల్లి మండలం పెద్దాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు 50 మంది మంత్రి సమక్షంలో చేరారు.
అలాగే మద్దూరు మండలం గోకుల్నగర్కు చెందిన వంద మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో గులాబీ పార్టీలో చేరా రు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు వేసి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి, చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్శితులై ప్రతిపక్షాల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో భారీగా చేరుతున్నారని పేర్కొన్నా రు. కొడంగల్ అభివృద్ధికి పాటుపడే ప్రతి ఒక్క రూ బీఆర్ఎస్ పార్టీలో చేరి, పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఈ ఎన్నికల్లో కొడంగల్లో గులాబీ జెండా ఎగురవేయడమే కాకుం డా హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ను నిలబెట్టుకుందామని తెలిపారు. పార్టీలో చేరుతున్న ప్రతి కార్యకరక్తు పార్టీ అండగా నిలుస్తున్నదని తెలిపారు. పని చేసే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందన్నా రు. పార్టీలో చేరిన వారిలో అక్బర్ హుస్సేన్, దీపక్, హరికృష్ణ, ఆంజనేయులు, ప్రవీణ్, శ్రీకాం త్, వేణు, చక్రవర్తి, శ్రీనివాస్, విష్ణు, ప్రశాంత్, చరణ్, తిరుపతి, శివ, సమీర్, రాజు తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.