శంషాబాద్ రూరల్, సెప్టెంబర్ 1: పాలమాకు ల కస్తుర్బాగాంధీ హాస్టల్ విద్యార్థినులకు ప్రభు త్వం అండగా ఉంటుంద ని రాష్ట్ర ఐటీశాఖ మం త్రి శ్రీధర్‌బాబు హామీఇ చ్చా రు. మండలంలోని పాలమాకుల కస్తుర్బాగాంధీ హాస్టల్‌ను స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌తో కలిసి ఆయన ఆదివారం సందర్శించారు. విద్యార్థినుల తో మాట్లాడి వారికి మౌలిక వసతులు అందుతున్నాయా? లేదా..? అని ఆరా తీశారు. విద్యార్థినులతో దురుసుగా ప్ర వర్తించిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామన్నారు.
మరోసారి ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థినులు భోజనం చేస్తుండగా వారికి వడ్డిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. వారితోపాటు డైనింగ్ హాల్లో కూర్చొని ధైర్యం చెప్పారు. మీకు ఎలాంటి ఇబ్బందులొచ్చినా ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ దృష్టికి తీసుకెళ్లాలన్నారు. అనంతరం ప్రకాశ్‌గౌడ్ మాట్లాడుతూ.. విద్యార్థినులకు విద్యతోపాటు నాణ్యమైన భోజనం, పరిశుభ్రమైన తాగునీటిని అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. గురుకులాన్ని సందర్శించిన వారిలో ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్, మాజీ జడ్పీటీసీ తన్వీరాజు, చంద్రారెడ్డి, రాజు, రవీందర్ తదిరులున్నారు.