రంగారెడ్డి, జూన్ 5 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ అధ్వానంగా మారింది. సోమవారం నుంచి ధాన్యం కొనుగోళ్లను నిలిపేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా, రైతుల నుంచి సేకరించిన ధాన్యం ఇప్పటివరకు యాభై శాతం కూడా పూర్తి కాలేదు. మిగతా ధాన్యమంతా కల్లాల్లోనే నిల్వ ఉన్నది. కొనుగోళ్ల ప్రక్రియ నిలిపేస్తే తమ ధాన్యాన్ని ఎక్కడ విక్రయించాలని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ధాన్యాన్ని సేకరించేందుకు ప్రభుత్వం 37 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల ద్వా రా 40 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. మరోవైపు కొనుగోళ్లకు సోమవారం చివరిరోజు కావటంతో రెండురోజుల్లోనే ధా న్యమంతా కొనాలంటే అధికారులకు సాధ్యంకాని పరిస్థితి ఏర్పడింది.
రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని అన్లోడింగ్ చేసేందుకు అధికారులు 8 రైస్‌మిల్లులను ఎంపిక చేశారు. ఈ ఎనిమిదింటిల్లో మూడు రైస్‌మిల్లుల్లో ధాన్యాన్ని అన్లోడింగ్ చేసేందుకు గోడౌన్ల సౌకర్యం లేదని మిల్లర్లు చేతులెత్తేశారు. దీంతో ఐదు మిల్లులోనే కొనుగోలు చేసిన వడ్లను అన్లోడింగ్ చేస్తున్నారు. ప్రతిరోజూ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వస్తున్నదే తప్పా…ఆ కేంద్రాల నుంచి ఆశించిన స్థాయిలో ధాన్యం మాత్రం బయటికి వెళ్లడంలేదు. ముఖ్యంగా లారీలు, హమాలీల కొరత అధికారులను వేధిస్తున్నది. మరోవైపు జిల్లాలో ఇంకా కొన్ని ప్రాంతా ల్లో వరికోతలు పూర్తికాలేదు. నేటికీ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వస్తూనే ఉండడంతో అన్లోడింగ్ కోసం మరిన్ని అదనంగా రైస్‌మిల్లులను ఏర్పాటు చేయాల ని రైతులు కోరుతున్నారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో ధాన్యాన్ని విక్రయించిన డబ్బుతో విత్తనాలు, ఎరువులు కొనాలని భావించిన రైతన్నకు నిరాశే ఎదురైం ది. సకాలంలో కొనుగోళ్లు పూర్తికాక..చేతిలో డబ్బుల్లేక పోవడంతో అన్నదాత అవస్థలు పడుతున్నాడు.
కొనుగోళ్లు సకాలంలో పూర్తి కాకపోవడంతో నేటికీ కల్లాల్లోనే ధాన్యం కుప్పలు ఉన్నాయి. దీంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు వర్షాలు కురుస్తుండడంతో రైతులు భూములను చదును చేసుకుంటున్నా రు. ప్రభుత్వం స్పందించి కొనుగోళ్లు త్వరగా పూర్తైయ్యేలా చర్యలు తీసుకోవాలి.
-రఘురాంనాయక్, లోయపల్లి సర్పంచ్
బాసుపల్లిలో ఉన్న పీఏసీఎస్ కేంద్రానికి ధాన్యాన్ని తీసుకొచ్చి వారం రోజులు అవుతున్నది. వడ్లను ట్రాక్టర్ నుంచి ఇంకా కిందికే దింపలేదు. త్వరగా కాంటా వేయాలని కొనుగోలు కేంద్రంలోని సిబ్బందిని అడిగితే లారీలు రాకపోవడంతో ఆలస్యమవుతుందని చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి లారీలను త్వరగా పంపించాలి. లేకుంటే అకాల వర్షానికి వడ్లు తడిచిపోయి మొలకలు వస్తాయి.
-మైస రాములు, రైతు, బాసుపల్లి, దోమ
దిర్సంపల్లిలో ఉన్న ఐకేపీ కేంద్రానికి తీసుకొచ్చిన ధాన్యం కుప్పలు, కుప్పలు పేరుకుపోయింది. గత పది రోజులుగా అకాల వర్షాలు కురవడంతో నిల్వ ఉంచిన ధాన్యం మొలకలు వచ్చింది. వారం రోజుల కిందట అదనపు కలెక్టర్ వచ్చి సందర్శించారు. త్వరగా ధాన్యం కొనుగోళ్లు చేయాలని నిర్వాహకులను ఆదేశించా రు. ఆయన వెళ్లిన తర్వాత రెండు రోజులు లారీలు వచ్చాయి. ఆ తర్వాత లారీలు రావడమే లేదు. రైతులం తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. సత్యయ్య, రైతు, దిర్సంపల్లి, దోమ
కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి 25 రోజులు గడిచినా కొనడంలేదు. త్వరగా కాంటా చేయాలని అక్కడి సిబ్బందిని అడిగితే లారీలు రావడం లేదు.. మిల్లుల దగ్గర లారీలు ఖాళీ కావడం లేదని చెబుతున్నారు. ఇప్పటికే సంచుల్లో అడుగు భాగంలో ఉన్న ధాన్యానికి మొలకలు వచ్చాయి. అధికారులు స్పందించి త్వరగా కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలి.
-పీ మోహన్, దిర్సంపల్లి, దోమ