కందుకూరు, ఫిబ్రవరి, 26 : విద్యార్థులు విద్యలో రాణిస్తేనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని మహేశ్వరం నియోజకవర్గం బిజెపి ఇన్చార్జి అందెల శ్రీరాములు యాదవ్ తెలిపారు. చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండ విశ్వేశ్వర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మండల పరిధిలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థులకు రూ.2500ల చొప్పున నగదు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు భట్టి చదువులకు స్వస్తి పలికి ఇష్టంగా చదువుకోవాలని సూచించారు.
కన్న తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో నిమ్మ అంజిరెడ్డి, దేవేందర్ రెడ్డి, నల్లబోలు నరసింహారెడ్డి, మంద పాండు, ఎగ్గిడి సత్తయ్య, సురుసాని భూమి రెడ్డి, మండల నాయకులు రవీందర్ గౌడ్ ,కళ్లెం చెన్నారెడ్డి, చిలుకల రఘునందన్, సామల దయాకర్ రెడ్డి, ఢిల్లీ అనిల్, నరసింహ, పాండు, ఆంజనేయులు, శ్రీశైలం నాయక్, రామకృష్ణ, ప్రదీప్ రెడ్డి, మధు, సాయి ,సురేష్, నరేందర్ ముదిరాజ్ ,రవీందర్ ముదిరాజ్, గురు నాయక్ తదితరులు పాల్గొన్నారు.