కులకచర్ల : క్రీడలతో గ్రామాల్లో స్నేహాభావం పెంపొందుతాయని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. బుధవారం కులకచర్ల మండల పరిధిలోని అంతారం గ్రామంలో యువజన సంఘాల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంటు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఖాళీ సమయాల్లో క్రీడలు నిర్వహించుకోవడంతో మానసిక ప్రశాంతతో పాటు శారీరకధారుడ్యం ఏర్పడుతుందన్నారు. క్రీడలు స్నేహాభావాన్ని పెంపొందిస్తాయన్నారు. సమాజానికి పనికొచ్చే కార్యక్రమలు, సామాజిక సేవచేసేందుకు యువత ముందుకురావాలని సూచించారు. ప్రతి ఒక్కరూ గ్రామాల అభివృద్ధిలో పాలుపంచుకోవాలని అన్నారు.
ఈ సందర్భంగా జిల్లాస్థాయి క్రికేట్లో ప్రథమ బహుమతి పొందిన అంతారం జట్టుకు పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి 25వేలు అందజేయగా, ద్వితీయ బహుమతి కింద 12వేలు డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డి అందజేశారు. నగదుతో పాటు, బహుమతులను ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి జట్లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ హరికృష్ణ, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు పీరంపల్లి రాజు, కులకచర్ల మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు శేరి రాంరెడ్డి, దోమ ఎంఈవో హరిశ్చందర్, టీఆర్ఎస్ నాయకులు కృష్ణయ్యగౌడ్, బుగ్గయ్య, అంతారం టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు శివానంద్, క్రీడాకారులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ కార్యకర్తను మరామర్శించిన ఎమ్మెల్యే…
కులకచర్ల మండల పరిధిలోని అనంతసాగర్‌లో ఇటీవల అనారోగ్యంతో టీఆర్ఎస్ కార్యకర్త తల్లి మృతి చెందడంతో పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి టీఆర్ఎస్ కార్యకర్త అంజిలయ్యను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.