ఆమనగల్లు, జనవరి 3 : క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక ఆరోగ్యానికి దోహదపడుతాయని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని అయప్ప కొండ దగ్గర సీనియర్ నాయకుడు వస్పుల ప్రకాశ్ జ్ఞాపకార్థం జీఎస్ఆర్ యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, అందుకు తల్లిదండ్రులు కూడా సహకరించాలని కోరారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ నేనావత్ అనురాధ, సీఐ జాల ఉపేందర్, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, వైస్ చైర్మన్ తోట గిరియాదవ్, ప్యాక్స్ చైర్మన్ గంప వెంకటేశ్, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ సభ్యుడు పత్యానాయక్, నాయకులు రాజు, సుభాశ్, చంద్రశేఖర్ రెడ్డి, జంతుక కిరణ్, నిర్వాహకులు విక్టర్, హఫీజ్, రాఘవేందర్, ప్రవీణ్, శివ తదితరులు పాల్గొన్నారు