ధారూరు, జనవరి 8 : ఇంటింటికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ తెలిపారు. సోమవారం మండలంలోని కేరెళ్లి గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామం కొండాపూర్ ఖుర్దులో నీటి శుద్ధి కేంద్రాన్ని ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ధారూరు మండలంతో పాటు వికారాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా తాగు, సాగునీటిని తీసుకురావడానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ సునీతారెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మి, సర్పంచ్ నర్సింహారెడ్డి, విశ్రాంతి శాస్త్రవేత్త పెంటారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డి, ఎంపీడీవో చెన్నారెడ్డి, తహసీల్ద్దార్ భువనేశ్వర్, ఎంపీవో షఫీఉల్లా, ఎంపీటీసీ శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ రాములు పాల్గొన్నారు.
వికారాబాద్ : మండలంలోని పులుమద్ది గ్రామంలో నూతనంగా నిర్మించిన బీరప్ప దేవాలయంలో సోమవారం స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రత్యేక పూజలు చేశారు.
రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్‌ను ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘం(ట్రస్మా ) నాయకులు సోమవారం ఆయన నివాసంలో కలిసి సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు నాగయ్య, జిల్లా అధ్యక్షుడు ఎం లూయిస్, జిల్లా అధ్యక్షుడు ఎన్ వెంకట్ రెడ్డి, నియోజకవర్గ అధ్యక్షుడు సి. చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి బసవరాజు, పాఠశాలల కరస్పాండెంట్స్ తిరుమలయ్య ఉన్నారు.