కొడంగల్, ఫిబ్రవరి 4: ఆర్యవైశ్యుల అభ్యున్నతికి ప్రభు త్వం పూర్తి కృషి చేస్తుందని శాసనసభ సభాపతి గడ్డం ప్రసా ద్ తెలిపారు. ఆదివారం స్థానిక రాఘవేంద్ర ఫంక్షన్హాల్లో వికారాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ, మహిళా సంఘం, యువజన సంఘం, సేవాదళ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా సభాపతితో పాటు జెడ్పీచైర్‌పర్సన్ హాజరయ్యారు. వారిని ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఘ నంగా స్వాగతం పలికి, గజమాలతో సన్మానించారు. నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షుడు, కార్యవర్గ సభ్యులకు వా రు శుభాకాంక్షలు తెలిపారు.
అంతకుముందు ఆర్యవైశ్య జిల్లా సం ఘంతో పాటు అనుబంధ సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులతో పాటు కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసిం ది. పట్టణానికి చెందిన శివకుమార్ గుప్తా ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కొడంగల్ నియోకవర్గ ఇన్చార్జి తిరుపతిరెడ్డి, ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్, మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్‌రెడ్డి, వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ మంజుల, జడ్పీవైస్ చైర్మన్ విజయ్‌కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రశాంత్‌గుప్తా, ఆర్యవైభ్య సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బాలేశ్వర్‌గుప్తా, మల్లికార్జున్‌గుప్తా, గణేష్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు.