స్పీకర్‌కు ఘన స్వాగతం
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా పదవీబాధ్యతలు స్వీకరించి మొదటిసారిగా వికారాబాద్‌కు వచ్చిన గడ్డం ప్రసాద్‌కుమార్‌కు కలెక్టర్ నారాయణరెడ్డి, ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు.
- వికారాబాద్‌కు వచ్చిన గడ్డం ప్రసాద్‌కుమార్
- పోలీసుల గౌరవ వందనం స్వీకరణ
వికారాబాద్, డిసెంబర్ 17 : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా పదవీబాధ్యతలు స్వీకరించి మొదటిసారిగా వికారాబాద్‌కు వచ్చిన గడ్డం ప్రసాద్‌కుమార్‌కు కలెక్టర్ నారాయణరెడ్డి, ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. ఆదివారం వికారాబాద్ పట్టణంలోని అతిథి గృహానికి వచ్చిన ఆయనకు పోలీసులు గౌరవ వం దనం చేశారు. అనంతరం అమరవీరుల స్తూపం వద్దకు వెళ్లి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వికారాబాద్ నియోజకవర్గ, జిల్లాకు చెందిన పలు విషయాల ను కలెక్టర్ నారాయణరెడ్డి, ఆర్డీవో విజయకుమారి, ప్రజాప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు.
స్పీకర్ రాకను తెలుసుకున్న పలువురు ప్రజాప్రతినిధులు, అభిమాను లు తరలివచ్చి వచ్చి పుష్పగుచ్ఛాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. స్పీకర్‌ను కలిసిన వారిలో వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజులారమేశ్కుమార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాంచంద్రారెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ ఫ్లోర్ లీడర్ సుధాకర్‌రెడ్డి, కౌన్సిలర్ మురళి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

