రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం కన్న తండ్రిని కొడుకు హతమార్చాడు. ఈ విషాదకర సంఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధి పులుమామిడి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన జంగయ్యకు కొడుకు శేఖర్ ఉన్నాడు. కాగా, తనకు ఉన్న అర ఎకరం పొలాన్ని అమ్మేస్తామని కొంతకాలంగా తండ్రి జంగయ్యతో కొడుకు శేఖర్ అడిగేవాడు.
పొలాన్ని అమ్మేందుకు జగంయ్య అంగీకరించకపోవడంతో శేఖర్ తండ్రిపై కక్ష పెంచుకుని అర్ధరాత్రి తలపై రాయితో కొట్టి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు శేఖర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.