Software employee | భారీ సిమెంట్ పైపులను ఢీ కొట్టిన కారు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దుర్మరణం
కారు డ్రైవర్ అతివేగంతో జాగ్రత్తగా నడపడంతో రహదారి పక్కన ఉన్న భారీ సిమెంట్ పైపులను బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దుర్మరణం చెందింది.
మొయినాబాద్, అక్టోబర్ 31: కారు డ్రైవర్ అతివేగంతో జాగ్రత్తగా నడపడంతో రహదారి పక్కన ఉన్న భారీ సిమెంట్ పైపులను బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దుర్మరణం చెందింది. ఈ సంఘటన హైదరాబాద్ -బీజాపూర్ జాతీయ రహదారిపై గండిపేట చౌరస్తాలో జరిగింది. సీఐ మల్లికార్జున రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని మల్కాజీ గిరి ప్రాంతానికి చెందిన ప్రత్యూష(29) పెప్సికో గ్లోబల్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగినిగా పనిచేస్తుంది. అయితే శుక్రవారం కంపెనీ యాజమాన్యం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ లో గల జైతం పబ్బులో కార్పొరేట్ పార్టీని నిర్వహించింది. కంపెనీ నిర్వహించిన పార్టీకి ప్రత్యూష శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళింది.
కంపెనీ పార్టీ ఏర్పాటు చేసిందని రాత్రి ఇంటికి రావడం ఆలస్యం అవుతుందని తన తండ్రికి ఇంట్లో చెప్పి పార్టీకి వెళ్లింది. పార్టీకి వెళ్లిన తర్వాత శనివారం అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో తన ఎల్.ఎల్.బి క్లాస్మేట్ భరద్వాజ్ ఫోన్ చేసి పంపు వద్దకు వెళ్లాడు. అక్కడి నుంచి వారిద్దరూ కారులో మణికొండలో ఉండే వారి స్నేహితులు దుర్గ, అచల, కౌశిక్ రెడ్డి వద్దకు వెళ్లారు. అక్కడి నుంచి 6 మంది రెండు కార్లలో మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అపోజిగూడ సమీపంలో ఉన్న గండిపేట్ జలాశయం బ్యాక్ వాటర్ వద్దకు చేరుకున్నారు.
అయితే అక్కడికి వెళ్లిన తర్వాత భరద్వాజ్ కారు బురదలో కూరుకుపోయింది. అక్కడ ఉన్న మత్సకారుల సహకారంతో కారును బయటకు తీశారు. అక్కడ నుంచి హోండా సిటీ కారులో ముగ్గురు వెళ్లగా, టాటా హారియర్ కారులో ప్రత్యూష, భరద్వాజ్, కౌశిక్ రెడ్డిలు మణికొండ కు బయలుదేరి వెళ్తున్నారు. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గండిపేట చౌరస్తా వద్దకు రాగానే కారు నడుపుతున్న కౌశిక్ రెడ్డి అజాగ్రత్తగా అతివేగముగా నడపడంతో జాతీయ రహదారి పక్కకు ఉన్న భారీ సిమెంట్ పైపులను కారు బలంగా ఢీకొట్టింది. కారు ముందు భాగంలో రెండు బెలూన్లు ఓపెన్ కావడంతో ముందు సీట్లో ఉన్న భరద్వాజ్ కు, కారు డ్రైవింగ్ చేస్తున్న కౌశిక్ రెడ్డికి పెద్ద ప్రమాదం జరగకుండా కాళ్లు విరిగాయి. వెనక సీట్లో కూర్చున్న ప్రత్యూష రెండు సీట్ల మధ్య ఒత్తిడికి గురై దుర్మరణం చెందింది.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Software employee | భారీ సిమెంట్ పైపులను ఢీ కొట్టిన కారు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దుర్మరణం
Raptadu incident | వరుసకు బాబాయ్..! పెళ్లి చేసుకోవాలని బాలికపై ఒత్తిడి, రాప్తాడు ఘటనలో కీలక విషయాలు
Prakash Raj | ప్రకాష్ రాజ్‌కు సినిమా అవకాశాలు తగ్గడానికి కారణం అదేనా.. సంచలన విషయాలు బయటపెట్టిన భార్య
AP news | పులివెందులలో కార్లు, బైక్‌లకు నిప్పు పెట్టిన దుండగులు.. పలు వాహనాలు ధ్వంసం
Choutuppal | కండ్లలో పెప్పర్ స్ప్రే కొట్టి , కాళ్లు చేతులు కట్టేసి శివసత్తు దారుణ హత్య
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

