ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 11 : బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈనెల 27న వరంగల్‌లోని ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు దండులా తరలివెళ్లి.. సక్సెస్ చేద్దామని ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఎలిమినేడులోని వ్యవసాయ క్షేత్రంలో రజతోత్సవ గోడ పత్రికను ఆవిష్కరించి మాట్లాడారు.
తెలంగాణ ప్రజల చిరకా ల వాంఛను కేసీఆర్ నెరవేర్చి రాష్ర్టాన్ని సాధిం చి..అన్ని రంగాల్లో తెలంగాణను అగ్రగామిగా నిలిపారని కొనియాడారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా.. ప్రజలు మాత్రం కేసీఆర్‌ను కోరుకుంటున్నారన్నారు. వరంగల్ సభకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలిరావాలన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ భరత్‌కుమార్, బీఆర్ఎస్ నాయకులు రమేశ్‌గౌడ్, బుగ్గరాములు, రమేశ్, కిషన్‌గౌడ్, అల్వాల వెంకట్‌రెడ్డి, బిట్ల వెంకట్‌రెడ్డి, బాష, గణేశ్, రఘుపతి, ఐలయ్య, మంద సురేశ్, భాస్కర్‌రెడ్డి, జంగయ్య, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.