కేశంపేట, సెప్టెంబర్ 14 : రంగారెడ్డి జిల్లా కేశంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2000 – 2001లో 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఆదివారం సమావేశమయ్యారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థుల సమ్మేళన (సిల్వర్‌జూబ్లీ) వేడుకల్లో తమ పూర్వపు గురువులు స్వరాజ్బాబు, నర్సయ్య, దివాకర్, ఖాజామోయినోద్దీన్, శశిధర్, రవీందర్‌రెడ్డి, విజయ్‌మోహన్‌రెడ్డి, వెంకట్రెడ్డిలను శాలువాలు, పూలమాలలతో సత్కరించారు.
ఈ సందర్భంగా తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని సంతోషంగా గడిపారు. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు కారణమైన గురువులు, తల్లిదండ్రులను గౌరవిస్తూ జీవితాంతం వారికి రుణపడి ఉంటామన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు చంద్రశేఖర్, జావిద్, టి.రాజు, పాండు, చందు, నర్సింహా, మల్లేశ్, నీలమ్మ, స్వప్న, లావణ్య, స్వాతి, రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.