షాద్‌నగర్ రూరల్, జూన్ 04 : గ్రామీణ ప్రాంతాలలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ పార్థసారధి అన్నారు. ఫరూఖ్‌నగర్ మండలంలోని ఎలికట్ట, శేరిగూడ గ్రామంలో బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో అయన పాల్గోని పిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎలికట్ట గ్రామంలో రైతుల నుండి 8 దరాఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. టిలో విరాసత్లను పరిష్కరించనున్నట్లు తెలిపారు. రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని గ్రామీణ ప్రజలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.