గ్రేటర్ హైదరాబాద్ పరిధిని మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తప్పు పట్టారు. స్థానిక ప్రజా ప్రతినిధులతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండా.. ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడాన్ని ఖండిస్తున్నామని ఆమె లేఖలో పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లోని పట్టణ ప్రాంతాలను రెండు వేర్వేరు కార్పొరేషన్లలో కలపడం వెనుక ఉద్దేశం ఏంటి? అని సీఎం రేవంత్ రెడ్డిని సబిత ప్రశ్నించారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిని మూడు కార్పొరేషన్లుగా విభజించిన తీరుపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
గ్రేటర్ హైదరాబాద్ పరిధిని మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హేతుబద్ధత లేకుండా, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా… https://t.co/oeYsIrxMi5 pic.twitter.com/UWd8BwPEQ8
— Telugu Scribe (@TeluguScribe) February 12, 2026
అలానే సైబరాబాద్‌కు దగ్గరగా ఉన్న బండ్లగూడ, రాజేంద్రనగర్, శంషాబాద్ వంటి ప్రాంతాలను హైదరాబాద్ కార్పొరేషన్లో కలపడం ఏంటి?, మల్కాజ్గిరి కార్పొరేషన్‌కు పక్కనే ఉన్న బడంగ్పేట్, తుక్కుగూడ, మీర్పేట్ వంటి ప్రాంతాలను హైదరాబాద్ కార్పొరేషన్లో కలపడం వెనక మతలబు ఏంటి? అని ఆమె కాంగ్రెస్ ధోరణిని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలపై భారాన్ని మోపే నిర్ణయాలను విరమించుకోవాలని, ప్రభుత్వం తన తప్పును సరిదిద్దుకోవాలి అని సబితా రెడ్డి డిమాండ్ చేశారు.