షాద్‌నగర్, మార్చి 7 : బీఆర్ఎస్ అంటేనే అభి వృద్ధి అని.. కాంగ్రెస్ అంటే అబద్ధమని మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. అబద్ధాలు చెప్పడం, ఇష్టానుసారంగా మాట్లాడడం తప్పా చేసిన అభివృద్ధి ఎక్కడో చూపాలని కాంగ్రెస్ ప్ర భుత్వానికి, స్థానిక కాంగ్రెస్ నాయకులకు ఆయన సవాల్ విసిరారు. ఇటీవల కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యే శంకర్ గత బీఆర్ఎస్ సర్కార్‌తోపాటు తన పనితీరును విమర్శించిన నేపథ్యంలో శుక్రవారం షాద్‌నగర్ పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో స్థానిక నేతలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంజయ్య యాదవ్ మాట్లాడుతూ..కేసీఆర్ హ యాంలో జరిగిన అభివృద్ధిపై కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ.. వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని, తాను వారిలాగే మాట్లాడాలంటే సంస్కారం అడ్డొస్తున్నదని పేర్కొన్నారు.
65 ఏండ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనలో జరిగిన అభివృద్ధి, పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో సాధించిన ప్రగతిపై చర్చ పెడుతామని.. ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో ప్రజలే తేల్చుతారన్నారు. లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టుపై కనీస అవగాహన లేకుండా మాట్లాడడంపై మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్ చెప్పేవరకు లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ అంటే ఎవరికీ తెలియదని.. ఆనాడు కాంగ్రెస్ నాయకులు, ఇప్పటిపరిగి ఎమ్మె ల్యే రామ్మోహన్‌రెడ్డి ఆ ప్రాజెక్ట్‌ను నిర్మించొద్దని ధర్నా చేసింది నిజం కదా ? అ ని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా షాద్‌నగర్ నియోజకవర్గానికి రూ. 5.6 వేల కోట్ల నిధులను మంజూరు చేసి టెండర్లను పిలిచారని.. అయితే, ప్రభుత్వం మారడంతో ఆ పనులు మధ్యలోనే ఆగిపోయాయన్నారు.
బీఆర్ఎస్ హ యాంలో పాలిటెక్నిక్ కళాశాల మంజూరైతే మా హయాంలోనే మంజూరైందని కాంగ్రెస్ నాయకులు చెప్పుకొంటున్నారన్నారన్నారు. అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటినా చటాన్‌పల్లి ఆర్వో బీ పనులు ఎందుకు ప్రారంభం కాలేదని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని శాఖల వారీగా వివరించేందుకు తాను సిద్ధమని స్పష్టం చేశారు. పాత జాతీయ రహదారి విస్తరణకు నిధులను విడుదల చేస్తే, వా టిపై తప్పుడు ప్రచారం చేయడం కాంగ్రెస్‌కే చెల్లిందని ఎద్దేవా చేశారు.
లోవోల్టేజీతోపాటు ఇతర సమస్యలతో అన్నదాత లు ఇబ్బందులకు గురవుతున్నారని వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదన్నారు. సమస్యలు పరిష్కారం కాకుంటే రైతుల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. సమావేశం లో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఈటె గణేశ్, మాజీ మున్సిపల్ చైర్మన్ నరేందర్, సీనియర్ నాయకుడు నారాయణరెడ్డి, సహకార సంఘాల మాజీ కార్పొరేషన్ చైర్మన్ రాజావరప్రసాద్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నటరాజన్, మండలాల అధ్యక్షులు లక్ష్మణ్‌నాయక్, మురళీధర్‌రెడ్డి, కృష్ణ, శ్రీధర్‌రెడ్డి, మండలాల నాయకులు పాల్గొన్నారు.