షాబాద్ : వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి చంద్రమోహన్, జెఏసీ జిల్లా అధ్యక్షుడు జానకిరాములు అన్నారు. గురువారం రంగారెడ్డి కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో జెఏసీ జిల్లా కార్యదర్శి ప్రసాద్, వినోద్‌కుమార్, వీఆర్ఏలు పాల్గొన్నారు.