కొండాపూర్, అక్టోబర్ 19: కాలనీల సమస్యలను ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లేలా కాలనీ అసోసియేషన్లు ఒకే తాటిపైకి వచ్చాయి. చందానగర్ డివిజన్ పరిధిలోని భవానీపురం, భవానీ శంకర్ కాలనీ, ఎన్బీఆర్ కాలనీ, వీరారెడ్డి కాలనీ, నారాయణరెడ్డి కాలనీ, వెంకటరమణ కాలనీల అసోసియేషన్ ప్రతినిధులు ఆదివారం సమావేశమయ్యారు.
కాలనీలు ఎదుర్కుంటున్న ప్రధాన సమస్యలతో పాటు అశోక్ నగర్ నుంచి ఆయా కాలనీలకు వెళ్లే దారిలో ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లేలా చర్యలు తీసుకోనున్నట్లు అసోసియేషన్ల ప్రతినిధులు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అసోసియేషన్లు కాలనీల అభివృద్ధికి పాటు పడాలని, సమస్యలను ఎప్పటికప్పుడు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లేలా చర్యలు తీసుకుంటామని ఉమ్మడిగా నిర్ణయించుకున్నారు.