ఇబ్రహీంపట్నం, నవంబర్ 16 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్కు గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు దండెం రాంరెడ్డి గురువారం రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఆ నియోజకవర్గంలో రాంరెడ్డి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం మల్రెడ్డి రంగారెడ్డికి అమ్ముడుపోయి సర్వేల పేరుతో తనకు అన్యాయం చేసిందన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటమి తప్పదన్నారు.