ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్కు గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు దండెం రాంరెడ్డి గురువారం రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
గాంధీభవన్లో ఆందోళన పర్వం ఆగట్లేదు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి టికెట్లు అమ్ముకుంటున్నాడని ఆరోపిస్తూ నిత్యం ధర్నాలు, ఫ్లెక్సీ దహనాలు జరుగుతూనే ఉన్నాయి.