పాఠశాల పనులను వేగవంతం చేయాలి
విద్యా సంవత్సరం ప్రారంభంలోపు అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పూర్తి చేయాలని కలెక్టర్ శశాంక ఆదేశించారు. మండల పరిధిలోని చందానగర్ జిల్లా పరిషత్, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలల్లో జరుగుతున్న ‘అమ్మ ఆదర్శ పాఠశాల’ పనులను బుధవారం ఆయన పరిశీలించారు.
- రంగారెడ్డి కలెక్టర్ శశాంక
మొయినాబాద్, మే22: విద్యా సంవత్సరం ప్రారంభంలోపు అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పూర్తి చేయాలని కలెక్టర్ శశాంక ఆదేశించారు. మండల పరిధిలోని చందానగర్ జిల్లా పరిషత్, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలల్లో జరుగుతున్న ‘అమ్మ ఆదర్శ పాఠశాల’ పనులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులతో మాట్లాడుతూ మండలంలో మొత్తం 51 పాఠశాలలు ఉన్నాయన్నారు. అందులో 5 జిల్లా పరిషత్ పాఠశాలలు, 14 ప్రాథమిక పాఠశాలలను అమ్మ ఆదర్శ పాఠశాలల కింద అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఆ పనుల కోసం రూ. 1లక్ష నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. పాఠశాలల్లో మరుగు దొడ్లు, విద్యుత్, తాగునీరు తదితర సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట డీఈవో సుశీందర్‌రావు, టీడబ్ల్యూ ఈఐడీసీ ఈఈ కుమార్‌గౌడ్, తహసీల్దార్ గౌతంకుమార్, ఎంపీడీవో సంధ్య, ఎంఈవో వెంకటయ్య, ఎంపీవో వెంకటేశ్వర్‌రెడ్డి, హెచ్ఎం రవీందర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి స్వప్న ఉన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

