Williams Sisters: ఒకప్పుడు మహిళల టెన్నిస్‌ను ఏలిన ‘విలియమ్స్ సిస్టర్స్’ (Williams Sisters) మునపటి జోరు చూపలేకపోయారు. కోర్టులోకి దిగారంటే తిరుగులేని ఆధిపత్యంతో రికార్డులు బద్ధలుకొట్టే సెరీనా విలియమ్స్, వీనస్ విలియమ్స్‌లు నాలుగేళ్ల తర్వాత డబుల్స్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఓటమి చవిచూశారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో సిన్సినాటి ఓపెన్‌లో బరిలోకి దిగిన ఈ అమెరికా నల్లకలువలు ప్రేక్షకులను అలరించారు. కానీ, మ్యాచ్ మాత్రం గెలవలేకపోయారు.
గ్రాండ్‌స్లామ్, ఏటీపీ టూర్.. టోర్నీ ఏదైనా టైటిల్ మాదే అన్నట్టు చెలరేగి ఆడే విలియన్స్ సిస్టర్స్ మరోసారి జంటగా అభిమానులను అలరించారు. నాలుగేళ్ల విరామం తర్వాత వీరిద్దరూ మహిళల డబుల్స్‌లో తొలిసారి ఆడారు. సిన్సినాటి ఓపెన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన వీరు అనూహ్యంగా మర్టా కొస్త్యుక్ – పీటన్ స్టీర్న్స్ చేతిలో ఓటమి పాలయ్యారు .
The year is 2026.
Serena and Venus Williams are STILL cooking.
44 and 46 years of age.
GOATS age like fine wine. 🍷🍷
😮💨😮💨😮💨😮💨 pic.twitter.com/DFAhsd21MO
— The Tennis Letter (@TheTennisLetter) August 18, 2026
కోర్టులో తమదైన షాట్లతో ఆకట్టుకున్న ఈ వెటరన్ సిస్టర్స్ తొలి సెట్ కోల్పోయినా రెండో సెట్లో పుంజుకున్నారు. కానీ, నిర్ణయాత్మక మూడో సెట్లో మాత్రం తేలిపోయారు. మొత్తంగా మూడు సెట్ల పోరులో 2-6, 6-1, 8-10తో మ్యాచ్ చేజార్చుకుని టోర్నీ నుంచి నిష్క్రమించారీ లెజెండ్స్. ఇదివరకూ 2022 యూఎస్ ఓపెన్‌లో చివరిసారిగా కలిసి ఆడారీ వెటరన్ సిస్టర్స్. గతంలో డబుల్స్ జోడీగా వీరు 14 టైటిళ్లు సాధించిన విషయం తెలిసిందే.