Hyderabad | ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 7 : విద్యాబుద్ధులు నేర్పాల్సిన ప్రిన్సిపాలే విద్యార్థిని పట్ల దారుణానికి ఒడిగట్టాడు. పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. హైదరాబాద్ శివారు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇబ్రహీంపట్నం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నానికి చెందిన దీనావన్రావు సీతారాంపేట సమీపంలో లయోలా ప్రైవేటు రెసిడెన్షియల్ పాఠశాలను నడుపుతున్నాడు. అతనే ప్రిన్సిపల్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై దీనావన్ రావు బుధవారం నాడు అసభ్యంగా ప్రవర్తించాడు
ఇబ్రహీంపట్నానికి చెందిన దీనావన్ రావు సీతారాంపేట్ సమీపంలో లయోలా ప్రైవేట్ రెసిడెన్షియల్ పాఠశాలను నడుపుతున్నాడు. పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. దీంతో ఏడ్చుకుంటూ ఇంటికెళ్లిన బాధిత విద్యార్థి.. తన తల్లికి జరిగిన విషయం చెప్పింది. దీంతో సదరు బాధితురాలిని తీసుకుని ఆమె తల్లి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. ప్రిన్సిపల్‌పై ఫిర్యాదు చేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఏసీపీ రాజు తెలిపారు.