జైపూర్, ఫిబ్రవరి 2: సర్పంచ్ల పదవీకాలం 31 జనవరి 2024తో ముగియడంతో జిల్లా ఉన్నతాధికారులు గ్రామపంచాయతీలకు గ్రామాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించారు. శుక్రవారం ప్రత్యేక అధికారులు బాధ్యతలు స్వీకరించారు. బెజ్జలా, నర్సింగాపూర్ గ్రామాలకు ఎన్ రవి, గంగిపెళ్లి, ఎల్కంటి గ్రామాలకు తిరుపతమ్మ, ఇందారం, మిట్టపెల్లి, నర్వ గ్రామాలకు అనిల్ కుమార్, జైపూర్ పెగడపల్లి, టేకుమాట్ల గ్రామాలకు పీ సత్యనారాయణ, కాన్కుర్, ముదిగుంటకు శశాంక్ రెడ్డి, కిష్టాపూర్, కుందారం, షేట్పల్లి గ్రామాలకు కమల్ సింగ్, పౌనూర్, శివ్వారం గ్రామాలకు మార్ గ్లాడ్సన్, రామారావు పేటకు కే రమేశ్ నియామకమయ్యారు. అధికారులకు ఎంపీటీసీలు తాజా మాజీ సర్పంచ్‌లు, స్థానికులు శుభాకాంక్షలు తెలిపారు.
హాజీపూర్, ఫిబ్రవరి 2 : మండలంలోని బుద్ధిపల్లి , దొనబండ, పెద్దంపేట గ్రామాలకు పశు వైద్యాధికారి సరిత, చిన్నగోపాల్పూర్, నాగారం, ర్యాలీ గ్రామాలకు పంచాయతీ రాజ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ అధికారి కామేశ్వర్ రెడ్డి, గఢ్‌పూర్, గుడిపేట, వేంపల్లి గ్రామాలకు మండల పంచాయతీ అధికారి శ్రీనివాస్, మండల కేంద్రానికి తహసీల్దార్ సతీశ్‌కుమార్, కర్ణమామిడి, సబ్బపెల్లి గ్రామాలకు డిప్యూటీ తహసీల్దార్ హరిత, నర్సింగాపూర్ గ్రామానికి ఎంపీడీవో అబ్దుల్ హై, పడ్తన్పల్లికి మిషన్ భగీరథ ఏఈ గిరిజ, రాపల్లి, హాజీపూర్, నంనూర్, గుడిపేట గ్రామాలకు పశువైద్యాధికారి శాంతి రేఖ, టీకన్నపల్లికి వ్యవసాయాధికారి మార్గం రజిత ప్రత్యేక అధికారులుగా బాధ్యతలు స్వీకరించారు.
చెన్నూర్ రూరల్, ఫిబ్రవరి 2: చెన్నూర్ మండలంలోని అన్ని గ్రామపంచాయతీల్లో ప్రత్యేక అధికారులు బాధ్యతలు చేపట్టారు. అధికారులకు పంచాయతీ సెక్రటరీలు స్వాగతం పలికి సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో మాజీ సర్పంచులు బుర్ర రాకేశ్ గౌడ్, అయిత పార్వతీ, మడక స్వప్న, అన్నల మానస, పెద్దింటి స్వరూప, మౌనిక, మాడ సుమలత, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
కోటపల్లి, ఫిబ్రవరి 2: మండలంలో పలు గ్రామాలకు నియమించిన ప్రత్యేకాధికారులు బాధ్యతలు స్వీకరించారు. వారికి పంచాయతీ సెక్రటరీలు స్వాగతం పలికి సన్మానించారు. రాంపూర్ గ్రామపంచాయతీ
ప్రత్యేక అధికారిగా కోటపల్లి మండల వ్యవసాయ శాఖ అధికారి మహేందర్ బాధ్యతలను స్వీకరించారు. ఆయనను గత పాలక వర్గంతో పాటు పంచాయతీ సెక్రటరీ సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
కన్నెపల్లి, ఫిబ్రవరి 2 : మండలంలో గొల్లగట్టు, జజ్జరవెల్లి గ్రామాలకు కన్నెపల్లి తహసీల్దార్ దత్తు ప్రసాద్‌రావు, జన్కాపూర్, టేకులపల్లి గ్రామాలకు నాయబ్ తహసీల్దార్ గోవర్ధన్, కన్నెపల్లి, లింగాల గ్రామాలకు ఎంపీడీవో రాధాకిషన్, మాడవెల్లి, సాలిగాం గ్రామాలకు వ్యవసాయాధికారి శ్రీకాం త్, ముత్తాపూర్, వీరాపూర్ గ్రామాలకు పంచాయతీరాజ్ ఏఈఈ కల్యాణ్‌రెడ్డి, నాయకునిపేటకు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శ్రీకాంత్, పోలంపల్లి, సుర్జాపూర్‌కు ఇరిగేషన్ ఏఈఈ వెంకటేశ్వర్లు , రెబ్బెనకు వెటర్నరీ డాక్టర్ హారిక నియమితులయ్యారు.
భీమిని, చిన్న తిమ్మాపూర్ గ్రామాలకు ఎంపీడీవో జవహర్లాల్, బిట్టూరుపల్లి, వెంకటాపూర్ , కేస్లాపూర్ గ్రామాలకు ఎంపీవో షేక్ సఫ్దర్ అలీ, చిన్నగుడిపేటకు వెటర్నరీ డాక్టర్ సందీప్, ఖర్జీ భీంపూర్కు నాయబ్ తహసీల్దార్ అంజయ్య, లక్ష్మీపూర్, పెద్దపేట గ్రామాలకు వ్యవసాయాధికారి విజయ్‌కుమార్, మల్లీడికి తహసీల్దార్ బికర్ణదాస్, వీగాం ఆర్‌డబ్య్లూఎస్ ఏఈఈ పోశం, అక్కలపల్లికి పంచాయతీరాజ్ ఏఈఈ రాంచందర్ నియమితులయ్యారు.
వేమనపల్లి, ఫిబ్రవరి 2 : మండలంలో గొర్లపల్లి, రాజారాం పంచాయతీలకు తహసీల్దార్ సదానందం, బుయ్యారం, జిల్లెడ గ్రామాలకు ఏవో వీరన్న, చామనపల్లి, కేతనపల్లికి వెటర్నరీ వైద్యురాలు అరుణ, దస్నాపూర్, సూరారం గ్రామాలకు ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ నరేశ్, కల్లెంపల్లి, సుంపుటం గ్రామాలకు డిప్యూటీ తహసీల్దార్ గోవింద్‌నాయక్, ముల్కలపేట, నీల్వాయికి ఎంపీవో శ్రీపతి బాపురావు , నాగారం, వేమనపల్లి గ్రామాలకు ఎంపీడీవో అల్లూరి లక్ష్మయ్య నియమితులయ్యారు.
తాండూర్, ఫిబ్రవరి 2 : మండలంలో తాండూర్, కిష్టంపేట్ పంచాయతీలకు ఎంపీడీవో వీ ప్రవీణ్‌కుమార్, అచ్చలాపూర్, గోపాల్‌నగర్‌కు తహసీల్దార్ రోహిత్ దేశ్‌పాండే, చౌటపల్లి, బోయపల్లికి వ్యవసాయాధికారి కిరణ్మయి, ద్వారకాపూర్, కాసిపేటకు ట్రాన్స్‌కో ఏఈఈ ఎస్ కల్యాణ్‌రెడ్డి, రేచిని, కొత్తప
ల్లికి ఎంపీవో సత్యనారాయణ, మాదారం, రాజీవ్‌నగర్‌కు నాయబ్ తహసీల్దార్ వీవీఆర్కేడీ ప్రసాద్, నర్సాపూర్, మాదారం త్రీ ఇైంక్లెన్కు పశు వైద్యాధికారి భూమయ్య, నీలాయిపల్లికి పశు వైద్యాధికారి పీవీ నరసింహారావు ప్రత్యేకాధికారులుగా బాధ్యతలు స్వీకరించారు.
నెన్నెల, ఫిబ్రవరి 2 : మండలంలోని ఆవుడం పంచాయతీకి ఆర్ దిలీప్, చిన్న వెంకటాపూర్ కు ప్రకాశ్, చిత్తాపూర్‌కు వరలక్ష్మి, గంగారాం గ్రామానికి దిలీప్, ఘన్‌పూర్‌కు టీ శ్రీనాథ్, గొల్లపల్లికి ఎన్ శ్రీనివాస్, గుండ్లసోమారానికి ప్రేమ్ కుమార్, జంగాల్పేటకు వరలక్ష్మి, జెండావెంకటాపూర్కు టీ శ్రీనాథ్, జోగాపూర్‌కు ఎన్ శ్రీనివాస్, కోనంపేటకు గోవింద్ చంద్ సర్దార్, కొత్తూర్ ప్రకాశ్, కుశ్నపల్లికి గోవింద్ చంద్ సర్దార్, మైలారం ఇమ్రాన్‌ఖాన్ పఠాన్, మన్నెగూడేనికి వరలక్ష్మి, మెట్పల్లి కి ప్రేమ్‌కుమార్, నందులపల్లికి ఇమ్రాన్‌ఖాన్ పఠాన్, నార్యాపేటకు ప్రేమ్ కుమార్, నెన్నెలకు శ్రీనివాస్‌ను నియమించారు.
బెల్లంపల్లిరూరల్, ఫిబ్రవరి 2: మండలంలోని ఆకెనపల్లి, పాతబెల్లంపల్లి, సోమగూడెం (వెదల శ్రీనివాస్, ఎంపీవో), అంకుశం, కన్నాల (స్వప్న, డిప్యూటీ తహసీల్దార్), బట్వాన్పల్లి, దుగ్నెపల్లి, పెర్కపల్లి (విష్ణుకుమార్, ఏఈ పీఆర్), బుచ్చయ్యపల్లి, లింగాపూర్ (డాక్టర్ సుజాత, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్), బూదాకలన్, చంద్రవెళ్లి ( సుప్రజ, హార్టీకల్చర్), బుధాకుర్థు, చాకెపల్లి (డీ రాజేందర్, ఎంపీడీవో), తాళ్లగురిజాల, లంబాడీతండా, మాల గురిజాల (పావని, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్) ప్రత్యేకాధికారులుగా బాధ్యతలు స్వీక రించారు.
దండేపల్లి, ఫిబ్రవరి 2 : మండలంలోని అల్లీపూర్, గుడిరేవు, లింగాపూర్(విక్రమ్‌రెడ్డి-పీఆర్ ఏఈ), కొర్విచెల్మ, ముత్యంపేట, చింతపెల్లి(అంజిత్‌కుమార్ వ్యవసాయాధికారి), చెల్కగూడ, నంబాల, రెబ్బెన్‌పెల్లి(ధన్‌రాజ్-పశువైద్యాధికారి), దండేపల్లి, నెల్కివెంకటాపూర్, వందూర్‌గూడ(వేముల మల్లేశం ఎంపీడీవో), ద్వారక, ధర్మారావుపేట, లక్ష్మీకాంతాపూర్, పెద్దపేట (శ్రీనివాస్-ఎంపీవో), గూడెం, కన్నేపల్లి(అరుణ్‌కుమార్-ఏఈ-మిషన్ భగీరథ-గ్రిడ్), కర్ణపేట, నర్సాపూర్, తాని మడుగు(విజయ-ఉప తహసీల్దార్), కాసిపేట, కొం డాపూర్, వెల్గనూర్(విజయభాస్కర్-ఏఈ ఇరిగే షన్), పాత మామిడిపెల్లి, మేదరిపేట, కొత్తమామిడి పెల్లి (సంధ్యారాణి-తహసీల్దార్), మాకుల పేట, నాగసముద్రం, రాజుగూడ, తాళ్లపేట (శిరీష ఏఈఆర్డబ్ల్యూఎస్)ప్రత్యేకాధికారులుగా కొనసాగనున్నారు.
జన్నారం, ఫిబ్రవరి 2 : తహసీల్దార్ వేణుగోపాల్‌కు జన్నారం, కామన్పెల్లి, కిష్టాపూర్, ఎంపీడీవో అరుణారాణికి చింతగూడ, కొత్తపేట, దేవునిగూడ, ఎంఈవో విజయ్‌కుమార్‌కు చింతలపల్లె, లింగయ్యపల్లె, బాదంపెల్లి. వెటర్నరీ డాక్టర్ శ్రీకాం త్‌కు ధర్మారం, రేండ్లగూడ, కే రాజుకు బంగారు తండా, హాస్టల్ తండా, కవ్వాల్, వెటర్నరీ డాక్టర్ రాజ్‌కుమార్‌కు ఇందన్‌పెల్లి, మొర్రిగూడ, టీజీ పల్లె, శీలం సతీశ్‌కు కలమడుగు, మురిమడుగు, వెంకటా పూర్, ఎంపీవో రమేశ్‌కు లోతొర్రె, మల్యాల, పొనక ల్, ఏవో సంగీతకు తిమ్మాపూర్, సింగరాయిపేట, రాంపూర్, డీటీ రామ్మోహన్‌కు తపాలాపూర్, రోటిగూడ, మహ్మదాబాద్ గ్రామాలకు ప్రత్యేకా ధిరులుగా బాధ్యతలు అప్పగించారు.
కాసిపేట, ఫిబ్రవరి 2 : కాసిపేట మండలంలోని ఎంపీడీవో ఎంఏ అలీంకు దేవాపూర్, గట్రావ్‌పల్లి, వ్యవసాయాధికారిని దేవులపల్లి వందనకు లంబాడీతండా(కే), లంబాడీతండా(డీ), సోమ గూడెం(కే), ఎంపీవో నాగరాజుకు కాసిపేట, ధర్మారావుపేట, మద్దిమాడ, తహసీల్దార్ భోజన్నకు చిన్న ధర్మారం, ముత్యంపల్లి, వెటర్నరీ డాక్టర్ సంపత్‌కు బుగ్గగూడెం(కే), పల్లంగూడ, ఏఈఈ ఇరిగేషన్ రవీందర్‌కు కొండాపూర్, కోనూర్, ఎఫ్ఆర్వో సుభాష్‌కు పెద్దనపల్లి, ఏఈ సరేశ్కు కోమటిచేను, మల్కేపల్లి, ఏఈ వినయ్‌కు రొట్టెపల్లి, వెంకటాపూర్, సోనాపూర్, డిప్యూటీ తహసీల్దార్ మాణిక్‌రావుకు మామిడిగూడెం, తాటిగూడ గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులుగా బాధ్యతలు స్వీకరించారు.
లక్షెట్టిపేట, ఫిబ్రవరి 2: లక్షెట్టిపేట మండలంలోని 18 జీపీల్లో వివిధ శాఖల అధికారులు బాధ్యతలు చేపట్టారు. వీరికి స్థానిక జీపీ కార్యదర్శులు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.
భీమారం, ఫిబ్రవరి 2 :మండలంలో ఆరెపల్లి ప్రత్యేకాధికారిగా విశ్వంబర్, భీమారానికి సతీశ్‌రెడ్డి, బూర్గుపల్లికి రాకేశ్ శర్మ, దాంపూర్‌కు అఖిల్, ఎల్కేశ్వరానికి కృష్ణ, కాజీపల్లికి శ్రీనివాస్, కొత్తపల్లికి కృష్ణ, మద్దికల్కు విశ్వంబర్, నర్సిం గాపూర్కు శ్రీనివాస్, పొలంపల్లికి సతీశ్‌రెడ్డిని నియ మించారు.