పరిగి, సెప్టెంబర్ 14: పరిగి మండలంలోని రాఘవాపూర్ గ్రామ పంచాయతీ పచ్చదనం, పరిశుభ్రతలో ఆదర్శంగా నిలిచి రాష్ట్ర స్థాయిలో మెరిసింది. ఈ గ్రామానికి 2023కు సంబంధించి స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ అవార్డు దక్కింది. గురువారం రాజేంద్రనగర్‌లోని టీఎస్ఐఆర్డీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు రాఘవాపూర్ సర్పంచ్ నల్క జగన్, పంచాయతీ కార్యదర్శి సురేశ్‌లకు అవార్డుతోపాటు ప్రశంసాపత్రాన్ని అందజేసి సన్మానించారు.
పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ హన్మంత్‌రావు, సెర్ప్ డైరెక్టర్ గౌతమ్, ఎంపీడీవో శేషగిరిశర్మ, ఎంపీవో దయానంద్ పాల్గొన్నారు.