Shadnagar | షాద్‌నగర్‌టౌన్, ఫిబ్రవరి 15: గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గొప్ప ఆధ్యాత్మివేత్త అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. పట్టణంలో గిరిజనుల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సేవాలాల్ జయంతి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డితో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ దేశం గర్వించదగ్గ ఆధ్మాత్మికవేత్త అని, ఆయన సూచించిన మార్గంలో అందరూ ముందుకు సాగాలని సూచించారుర. గిరిజనుల అభ్యన్నతికి సేవాలాల్ చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. అదేవిధంగా గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. మహనీయులను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పార్థసారథి, నాయకులు యాదయ్య, చెన్నయ్య, శ్రీకాంత్‌రెడ్డి, మిట్టునాయక్, మంగులాల్ నాయక్, రాజు నాయక్, రఘు నాయక్, నెహ్రూ నాయక్, శ్రీను నాయక్, గోపాల్ నాయక్, రాజు నాయక్ పాల్గొన్నారు.
ఆదర్శప్రాయుడు సేవాలాల్ మహారాజ్- మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్
గిరిజనుల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహారాజ్ అందరికి ఆదర్శప్రాయుడని మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. ఫరూఖ్‌నగర్ మండలంలోని గుండ్యానాయక్, కొండయ్యగడ్డ తండాల్లో నిర్వహించిన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపిన మహానీయుడు సేవాలాల్ మహారాజ్ కొనియాడారు. సేవాలాల్ గొప్ప ఆధ్యాత్మి గురువని, ఆయన ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలన్నారు. గత బీఆర్ఎస్ హయంలో గిరిజన తండాలను గ్రామ పంచాయతీలు చేయడంతో పాటు గిరిజనుల అభ్యన్నతికి ఎంతో కృషి చేయడం జరిగిందని గుర్తు చేశారు.