కందుకూరు, మే 26 : నీలం శ్రీనును బీఆర్ఎస్ పార్టీ కోల్పోవడం దురదృష్టకరమని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విచారం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని ముచ్చర్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు నీలం శ్రీను మృతి చెందడంతో పార్టీ నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న ఆమె మంగళవారం గ్రామానికి చేరుకొని శ్రీను పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. కుంటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం కల్పించారు.
ఇలాంటి సమయాల్లో ధైర్యంగా ఉండాలని సూచించారు. పార్టీ ఎల్లప్పుడు కుటుంబానికి అండగా ఉంటుందని తెలిపారు. ఆమె వెంట మండల పార్టీ అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, మాజీ సర్పంచ్‌లు కాస నర్సింహ, ప్రవీణ్ నాయక్, నాయకులు ఇరుపాక దామోదర్‌రెడ్డి, సురుసాని సురేందర్‌రెడ్డి, గంగాపురం లక్ష్మీనర్సింహరెడ్డి, చంద్రశేఖర్, ఎలుక మేఘనాధ్రెడ్డి, సురుసాని రాజశేఖర్‌రెడ్డి, మోహన్, సామ ప్రకాశ్‌రెడ్డి, పొట్టి ఆనంద్, మహిళా అధ్యక్షురాలు తాండ్ర ఇందిరమ్మ , యూత్ అధ్యక్షుడు తాళ్ల కార్తీక్, శ్రీకాంత్, వంశీ పాల్గొన్నారు.