హైదరాబాద్, ఆట ప్రతినిధి: భారత్ లో తొలి ప్రొఫెషనల్ ఫ్రాంచైజీ బేస్డ్ మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ) లీగ్ అయిన ఇండియన్ ఫైట్ లీగ్ (ఐఎఫ్ఎల్) హైదరాబాద్ లో సందడి చేయనుంది. ఈ లీగ్లో భాగంగా శనివారం రాత్రి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగే ఈవెంట్లో హైదరాబాద్, నార్త్ ఈస్ట్ ఫ్రాంచైజీ ఫైటర్లు తలపడనున్నాయి. ఇరు జట్లలో దేశ, విదేశాలకు చెందిన 24 మంది ఫైటర్లు ఉన్నారు.హైదరాబాద్ ఫ్రాంచైజీలో ఇద్దరు తెలుగు ఫైటర్లు ఉండటం విశేషం. మొత్తం 12 ఫైట్స్ అభిమానులను అలరించున్నాయి. ఈ ఈవెంట్ యూఎఫ్సీ ఫైట్ పాస్ ప్లాట్ఫామ్లో 200పైచిలుకు దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం అవుతుం దని నిర్వాహకులు తెలిపారు.