ఆర్కేపురం, జూలై 15 : సరూర్‌నగర్ స్టేడియంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జూలై 18న నిర్వహించనున్న యువ సంగ్రామ సభ ఏర్పాట్లను ఎమ్మెల్యేలు పటోళ్ల సబితాఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తదితరులు పరిశీలించారు. సభావేదిక పనులను ప్రారంభించిన అనంతరం పార్కింగ్ ఏర్పాట్లు, ప్రజల రాకపోకలు, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలపై సంబంధిత కమిటీలకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిరుద్యోగులకు ఇచ్చిన హామీల అమల్లో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వ మెడలు వంచి హామీలను నెరవేర్చుకుందామన్నారు. సభకు నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. బీఆర్ఎస్ నేతలు రాగిడి లక్ష్మారెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, క్యామ మల్లేశ్, గెల్లు శ్రీనివాస్, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.