అభివృద్ధిపై దృష్టి సారించాలని
మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన కౌన్సిలర్లు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిపై దృష్టి సారించాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ, శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారిఅన్నారు.
- మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితాఇంద్రారెడ్డి
- మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన పలువురు కౌన్సిలర్లు కలువగా.. అభినందించిన మాజీ మంత్రి
వికారాబాద్/మొయినాబాద్, ఫిబ్రవరి 19 : మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన కౌన్సిలర్లు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిపై దృష్టి సారించాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ, శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారిఅన్నారు. గురువారం బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆనంద్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కోంపల్లి అనంతరెడ్డి, సీనియర్ నాయకులు నర్సింహారెడ్డి, నరోత్తంరెడ్డి, శ్రీహరియాదవ్, మాజీ ఉసర్పంచ్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి కౌన్సిలర్లుగా గెలుపొందిన వారు వేర్వేరుగా కలువగా.. వారికి సబితాఇంద్రారెడ్డి, మధుసూదనాచారి అభినందనలు తెలిపారు.
అనంతరం సబితారెడ్డి మాట్లాడుతూ.. పార్టీలకతీతంగా అందరినీ కలుపుకొని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. రానున్నది మన ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటింగ్ శాతం పెరిగిందని.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీఆర్ఎస్కు అనుకూల ఫలితాలు వస్తాయన్నారు. కలిసిన వారిలో టీఎస్ఈడబ్ల్యూఐడీసీ మాజీ చైర్మన్ నాగేందర్‌గౌడ్, పట్టణాధ్యక్షుడు గోపాల్ముదిరాజ్, కౌన్సిలర్లు జగదీశ్వరి, హరిప్రియ, తాహేరాబేగం, మమత, అనంతలక్ష్మి, వేణుగోపాల్, పాండు, అశోక్‌కుమార్, శ్రీధర్, అనితామహేందర్రెడ్డి, నాయకులు మల్లేశం, సుభాన్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, సురేశ్, ప్రశాంత్ శ్రీనివాస్, మాణిక్‌రెడ్డి, ఎట్టయ్యగౌడ్, జైపాల్‌రెడ్డి, జగన్‌రెడ్డి, రాంచందర్, అశోక్‌గౌడ్, విఘ్నేశ్‌రెడ్డి, శ్రీకాంత్‌గౌడ్, రాఘవేందర్‌గౌడ్, చిరంజీవిగౌడ్, శ్రీకాంత్‌రెడ్డి, మహేశ్‌రెడ్డి, ప్రశాంత్‌గౌడ్, మహేందర్ తదితరులు ఉన్నారు.
పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలి
శంకర్పల్లి : ఓటమిని మెట్టుగా మలుచుకొని ముందుకు సాగాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో 11 వ వార్డు నుంచి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓటమి చెందిన లావణ్యను ఆమె గురువారం శంకర్‌పల్లిలోని వారి నివాసంలో కలిసి పరామర్శించి మాట్లాడారు. కార్యక్రమంలో గోవర్ధన్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

