రంగారెడ్డి, జూన్ 13 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో వానకాల పంటల సాగుకోసం అన్నదాత తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాడు. ప్రభుత్వం నుంచి రావాల్సిన రైతుభరోసా పెట్టుబడి సాయం, బోనస్ డబ్బులు రాకపోవడంతో పంటల సాగుకు మళ్లీ వడ్డీ వ్యాపారులు, దళారుల వద్ద అప్పు లు చేయాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గత యా సంగిలో అతివృష్టి, అనావృష్టితో అన్నదాత తీవ్రంగా నష్టపోయాడు. పెట్టుబడి కూడా రాలేదు.
జిల్లాలో వర్షాకాల పంటల సాగు ప్రారంభమైంది. ఇప్పటికే కొందరు రైతులు పొలాలను దున్ని నారు కూడా పోశా రు. మెట్ట పంటలు వేసేందుకు దుక్కులను సిద్ధం చేసుకుని విత్తనాలు, ఎరువులు కొనేందుకు సమయం వచ్చిం ది. కానీ, ప్రభుత్వం నుంచి రావాల్సిన రైతుభరోసాకు దిక్కేలేదు. గత యాసంగిలో సన్న వడ్లకు రావాల్సిన బోనస్ కూడా ఇప్పటివరకూ అందలేదు. ఈ పరిస్థితిలో అన్నదాత పంటల సాగు కోసం దళారులు, వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేయక తప్పడం లేదు.
గత బీఆర్ఎస్ హయాంలో పంటల సాగుకు ముందే రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం అందేది. దీంతో అన్నదాతలు ఎరువులు, విత్తనాలను సకాలంలో సమకూర్చుకునేది. కానీ, కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత పెట్టుబడి సాయం పంపిణీ సరిగ్గా సాగడంలేదు.. పంపిణీలో పూర్తిగా విఫలమైంది.
-అచ్చన శ్రీశైలం
సన్న వడ్లు పండిస్తే అన్నదాతకు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని నమ్మబలికిన కాంగ్రెస్.. నేడు ఆ బోనస్ డబ్బులను చెల్లించడంలేదు. చాలామంది రైతు లు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. యాసంగికి సంబంధించిన బోనస్ డబ్బులను వెంటనే చెల్లించి ఆదుకోవాలి.
-మంచిరెడ్డి వెంకటప్రతాప్రెడ్డి